స‌ర్దార్‌… ఇక రోజూ పండ‌గే

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌మోష‌న్ మొద‌లైపోంది. ఈరోజు టీజ‌ర్‌తో.. స‌ర్దార్ ప్ర‌భంజ‌నం స్టార్ట్ అయ్యింది. ఇక నుంచి రోజూ.. ఏదో ఓ రూపంలో సర్దార్ ప్ర‌మోష‌న్ క‌నిపిస్తూనే ఉండేలా చిత్ర‌బృందం జాగ్ర‌త్త‌లు తీసుకొంటోంది. శుక్ర‌వారం స‌ర్దార్ టీమ్ మేకింగ్ వీడియోని విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాల్లో ఉంది. శ‌నివారం సాంగ్ టీజ‌ర్‌ని ఆవిష్కరిస్తారు. ఆదివారం.. ఎలాగూ స‌ర్దార్ పాట‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. వాటితో పాటు ట్రైల‌ర్ కూడా చూపించేస్తారు.

ఈ ట్రైల‌ర్ మాస్‌కి మ‌రీ ముఖ్యంగా త‌న ఫ్యాన్స్‌కి నచ్చేలా ఉండేట్టు… ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నాడ‌ట‌. ట్రైల‌ర్‌ని తానే ద‌గ్గ‌రుండి మ‌రీ క‌ట్ చేయించాడ‌ని, ట్రైల‌ర్‌లో రెండు మూడు డైలాగులు అదిరిపోయే స్థాయిలో ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. టీజ‌ర్‌లో ఒక్క డైలాగ్ లేక‌పోయినా విజువ‌ల్ ట్రీట్‌లా ఉండేలా చూసుకొన్నాడు ప‌వ‌న్ రెండు నిమిషాల ట్రైల‌ర్లో మాత్రం.. డైలాగులు, పంచ్‌లు, స్టెప్పులూ అన్నీ గుప్పిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ కాజ‌ల్ లుక్ ఎలా ఉంటుందో చూపించ‌లేదు. ట్రైల‌ర్‌లో ఆ లోటు తీరిపోతోంది. మొత్తానికి ప‌వ‌న్ ప్ర‌భంజ‌నం టీజ‌ర్‌తో మొద‌లైపోయింది. మ‌రి ఈ హంగామా ఎక్క‌డి వ‌రకూ వెళ్లి ఆగుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close