ఆ ప్రచారం వెనుక బెట్టింగ్ మాఫియా…? ఆవేశ పడితే ఇల్లు గుల్లే..?

చంద్రబాబు ఈవీఎంల మీద పోరాటం చేస్తున్నారని.. ఆయన ఓడిపోతారన్న భయంతోనే ఇలా చేస్తున్నారని.. అంటే వైసీపీ గెలుపు ఖాయమని… సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు పొంగిపోతున్నారు. పోలింగ్ రోజు… వెల్లువెత్తిన మహిళలు, వృద్ధుల ఓటింగ్ సరళి చూసి… నిరాశపడిన వైసీపీ నేతలకు… చంద్రబాబు ఈవీఎంపై పోరాటం పేరుతో ధైర్యం ఇచ్చారు. కానీ దీన్నే బెట్టింగ్ మాఫియా మరో విధంగా ఉపయోగించుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ గెలుపు ఖాయమని.. పందేలు కాసుకోమని…. ఆ పార్టీ నేతలను… ఫోర్స్ చేయడానికి… ఈ తరహా ప్రచారం చేస్తున్నారనే భావన ప్రారంబమయింది. దీనికి తగ్గట్లుగానే వ్యవహారం నడుస్తోంది. తమ పార్టీ గెలుస్తుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళ్లిపోతున్న వైసీపీ నేతలు… పరిస్థితుల్ని ఏ మాత్రం అంచనా వేసుకోకుండా.. బెట్టింగ్ లకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో నంద్యాల ఉపఎన్నికల సమయంలో.. కచ్చితంగా ఇదే జరిగింది. అక్కడ… తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే లేదన్న విశ్లేషణలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి… నంద్యాలలోనే పదహారు రోజుల పాటు మకాం వేసి… ప్రచారం చేశారు. చంద్రబాబు చివరి రెండు రోజులు మాత్రమే ప్రచారానికి వచ్చారు. దాంతో… ఇక … వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పుకున్న వైసీపీ నేతలు.. పెద్ద ఎత్తున బెట్టింగులు కాశారు. ఈ బెట్టింగులు… వందల కోట్లకు చేరాయి. చివరికి అందరూ నష్టపోవాల్సి వచ్చింది. అప్పుడు భారీగా లాభపడింది.. బెట్టింగ్ రాయుళ్లే. కృత్రియ హైప్ తీసుకొచ్చి మరీ వైసీపీ నేతల్ని ముంచేశారన్న ప్రచారం జరిగింది.

ఇప్పుడు కూడా.. అదే పరిస్థితి ఉందని.. తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉండి… ఎంతో కొంత ఆలోచించగలిగే వ్యక్తులు అయితే… పోలింగ్ సరళని చాలా సులువుగా విశ్లేషించగలుగుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాల లబ్దిదారులు ప్రభుత్వానికి ఎలా అండగా ఉన్నారో ఇప్పటికీ కళ్ల ముందుఉంది. భౌగోళికంగా విడిపోయినా… మనస్థత్వాలు … ఒకటే ఉంటాయి. అలాంటప్పుడు… ఏపీలో ప్రజలు భిన్నంగా ఆలోచించే అవకాశం తక్కువ. ఇది తెలిసి కూడా.. చంద్రబాబు ఈవీఎంలపై పోరాటం అంటున్నారు కాబట్టి.. ఓటమి భయమేనని.. వైసీపీ గెలుస్తుందని.. బెట్టింగులకు… ఉత్సాహం చూపిస్తున్నారు. వారిని బెట్టింగులకు … ఓ మాఫియా ప్రొత్సహిస్తోంది. పరిస్థితి చూస్తే వైసీపీ నేతలు.. రెండు రకాలుగా నష్టపోతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close