ఆంధ్రోళ్లు ఆశించిన చోట అడ్డంగా పిండేశారు!

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేటర్లు కావడానికి రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఎన్నెన్ని అడ్డదార్లు తొక్కడానికి అవకాశం ఉంటుందో అన్నీ తొక్కేశారు. రాజకీయంగా ఎన్నికల సమయంలో ఎనెన్ని వక్రపోకడలకు అవకాశం ఉంటుందో.. అవన్నీ కూడా.. చాలా విశృంఖల రూపంలో ఈ ఎన్నికల నామినేషన్‌ సమయంలో కనిపించాయి. తమకు టిక్కెట్‌ అక్కర్లేకపోయినా.. నామినేషన్‌ వేసేసి.. అసలు టిక్కెట్‌ ఆశిస్తున్న వారినుంచి డబ్బు దండుకోవడానికి ఎగబడిన వారు కొందరు.. తామేదో నిజంగానే పోటీకి దిగుతున్నట్లుగా హడావుడి చేసి.. కిరాయి అనుచరులతో గలాభా సృష్టించి.. అయినకాడికి డబ్బు చేసుకోవాలని ఆరాటపడిన వారు కొందరు.. మహిళలకు సగం సీట్లు ఉండడంతో.. తమ భార్యలను, అక్కచెల్లెళ్లను తీసుకువచ్చి.. వారి ద్వారా వీధికొళాయి దగ్గర రచ్చ వేసుకున్నట్లుగా రచ్చలు సాగించి.. పార్టీ కార్యాలయాల పరువును బజారు కీడ్చిన వారు కొందరు.. ఇలా అనేక రకాలుగా బీ ఫారాలు, నామినేషన్లు, ఉపసంహరణలూ ముగిశాయి.
అయితే ఈ ఎన్నికల్లో ఎందరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు.. గ్రేటర్‌ కార్పొరేటర్లు కావడానికి రంగంలో ఉన్నారో ఇంకా లెక్కలు స్పష్టంగా తేలలేదు. అయితే.. అన్ని పార్టీలూ ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి సెటిలైన వారికి కూడా టికెట్లు పెద్ద సంఖ్యలోనే ఇవ్వడానికి ఎగబడిన మాట మాత్రం వాస్తవం. ప్రధానంగా తెదేపా, కాంగ్రెస్‌లలో వీరి హవా చెల్లుబడి అయినప్పటికీ.. తెరాస కూడా ఆంధ్రోళ్ల ఓట్ల మీద శ్రద్ధతో అంతో ఇంతో.. వారికి సీట్లు ఇచ్చింది. మొత్తం అన్ని పార్టీలనుంచి ఎందరు బరిలో ఉన్నారనే గణాంకాలను పక్కన పెడితే.. ఆంధ్రోళ్లు ప్రధాన పార్టీ టిక్కెట్‌లు ఆశించిన చోట్లలో వారినుంచి నామినేషన్లు వేసేసిన అదే పార్టీల్లోని మరికొందరు అభ్యర్థులు భారీగా డబ్బులు పిండేసినట్లు తెలుస్తున్నది. ఆంధ్రానుంచి వచ్చిన సెటిలర్లు కార్పొరేటర్లుగా బరిలోకి దిగుతున్నారంటేనే.. దాదాపుగా అంతా రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించిన వారే అయిఉండడం విశేషం. వీరందరూ ‘ఆస్తుల’ రంగాలకు సంబంధించిన వారే! అదే పార్టీనుంచి బీఫారాలు అందడానికి ముందు ఒకరికంటె ఎక్కువ మంది నామినేషన్లు వేసిన వైనం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రా సెటిలర్లు ప్రధానంగా ఆశించిన చోట, వీరినుంచి భారీగా డబ్బు పిండుకోవడానికే ఇతర అభ్యర్థులు ఎగబడ్డారు. నామినేషన్లు వేసిన వారు.. ఉపసంహరించుకోవడానికి కనీసం 50 లక్షలనుంచి వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తున్నది. ఇది కేవలం ఉపసంహరణలకు మాత్రమే.. మళ్లీ ప్రచారంలో సహకరించడానికి, మనస్ఫూర్తిగా తోడ్పాటు అందించడానికి.. ఇలా విడివిడిగా రేట్లు ఉంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close