హుజురాబాద్ ప్రచారం ప్రారంభం ముగింపు ఫేక్ లెటర్లతోనే !

తెలంగాణ రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. చివరి రెండు రోజులు ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలో రాజకీయ పార్టీలు ప్రయత్నించలేదు. ఓ పార్టీ ఫేక్ లెటర్లను ప్రచారం చేస్తే.. మరో పార్టీ దమ్ముంటే నేరుగా తలపడాలని సవాల్ చేయడానికి సరిపోయింది. ఈటల రాజేందర్ ఫిర్యాదు చేసినందునే దళిత బంధును నిలిపివేశామని ఎన్నికల సంఘం చెప్పిందంటూ ఓ లేఖ హఠాత్తుగా వైరల్ అయింది. నిజానికి ఈసీ ఎప్పుడూ అలాంటి సమాచారం ఆర్టీఐ చట్టాల ద్వారా ఇవ్వదు. దానికో పద్దతి, ఫార్మెట్ ఉంటుంది. కానీ అందులో నేరుగా ఈటల రాజేందర్ పేరు చెప్పడంతో ఆ లేఖను టీఆర్ఎస్ వర్గాలు విపరీతంగా వైరల్ చేశాయి. దానిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో కాదని.. దమ్ముంటే నేరుగాపోటీ పడాలని సవాల్ చేశారు. ఇది ఫినిషింగ్ టచ్ మాత్రమే.

హుజురాబాద్ వార్ ప్రారంభమైనప్పటి నుండి ఈ ఫేక్ ప్రచారాల హోరు సాగుతోంది. కొద్ది రోజుల కిందటే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ముస్లింలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ ఓ పోస్ట్ వైరల్ అయింది. దానిపై ఖండనలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి బీజేపీ నేతలకు ఏర్పడింది. ఆంధ్రజ్యోతి పేరు మీద రావడంతో . .ఆ పేపర్ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈటల రాజీనామా చేసి బీజేపీలో చేరిన వెంటనే… ఈటల రాజేందర్ కేసీఆర్ ను క్షమాపణ కోరినట్లుగా ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. దానిపై రచ్చ అయింది.

తర్వాత ఓ సామాజికవర్గాన్ని ఈటల బావమరది అవమానించిటన్లుగా వాట్సాప్ స్టేటస్‌లు .. ఆడియో టేపులు ఇలా రకరకాలుగా బయటకు వచ్చాయి. తాజాగా దళిత బంధు ఆపాలంటూ ఈటల లేఖ రాశారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపించారు. ఫేక్ పోస్టులు రావడం.. వెంటనే టీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం .. బీజేపీ నేతలు ఖండించడం జరుగుతూనే వచ్చాయి. చివరికి ప్రచారం కూడా అదే ఫేక్ లెటర్‌తో ముగిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close