రోజుకు రు.5 కోట్లు పెరుగుతున్న ‘హైదరాబాద్ మెట్రో’ ప్రాజెక్ట్ కాస్ట్!

హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ మెట్రోను లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్ అండ్ టి) సంస్థ 2017 జులై నాలుగోతేదీకి పూర్తి చేయాల్సిఉండగా, అది సాధ్యమయ్యే పనికాదని ఆ కంపెనీ అధినేత వీబీ గాడ్గిల్ తేల్చేశారు. మెట్రో మార్గాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించటం, కొన్నిచోట్ల భూసేకరణలో సమస్యలువంటి కారణాల వలన ప్రాజెక్ట్‌లో జాప్యం ఏర్పడుతోందని గాడ్గిల్ చెప్పారు.

సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాలలో మార్గాన్ని మార్చాలని ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు ఎల్ అండ్ టి అధికారులు ఈ ఏడాది మే నెలలో నూతన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వంనుంచి ఇంకా అనుమతి లభించలేదు. సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాలలో పనులు ఆగిపోయి సంవత్సరం దాటిపోయింది. పాతబస్తీలో పనులు అసలు ప్రారంభమే కాలేదు. ఇక్కడ రీ డిజైనింగ్ వీలుకాదని ఎల్ అండ్ టి సంస్థ ప్రభుత్వానికి తేల్చి చెప్పేసింది.

నాగోల్-మెట్టుగూడ మధ్య మొదటి దశ ఈ ఏడాది మార్చి 21కి ప్రారంభిస్తామని ఒకసారి, ఆగస్ట్ 15కు ప్రారంభిస్తామని మరోసారి చెప్పినప్పటికీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్ట్ ఆలస్యంకావటంతో ఖర్చు పెరిగిపోతుందని ఎల్ అండ్ టి అధికారులుకూడా ఆందోళన చెందుతున్నారు. ఒక్కోరోజు ఆలస్యానికి ప్రాజెక్ట్ వ్యయం రు.5 కోట్లు పెరుగుతుందని చెబుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభించేటపుడు దీని వ్యయం అంచనా రు.14,370 కోట్లు కాగా, ప్రస్తుతం ఇది రు.20,000 కోట్లకు చేరింది. ప్రాజెక్ట్ ఇదే స్థాయిలో సాగితే ఈ వ్యయం రు.25,000 కోట్లకు చేరుతుందని అంచనా. ఎంత పెరిగినా ఈ భారాన్ని చివరకు మోయాల్సింది ప్రజలే కదా!

హైదరాబాద్ మెట్రో ప్రారంభమైననాటినుంచి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి జర్నలిస్టులకు మంచి ఆతిథ్యాలిచ్చి ప్రాజెక్ట్‌ను మీడియాలో గొప్పగా చూపించటమేగానీ అది ఎంత అధ్వాన్నంగా సాగుతుందో రోజూ రోడ్లపై దాని ప్రభావాన్ని అనుభవిస్తున్న నగరవాసులకు తెలుసిన విషయమే. పనులు జరుగుతున్న మార్గం పొడవునా పైనుంచి వర్షం పడుతున్నట్లు నీళ్ళు పడటం టూవీలర్స్‌పై వెళుతున్నవారందరికీ అనుభవైకవేద్యమే. మెట్రో పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించటం, అభివృద్ధిచేసి వాటిని నగరవాసులకు సూచించటంవంటి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నా అవి చేపట్టిన పాపాన పోలేదు. జర్నలిస్టులకు పార్టీలిచ్చి పొగిడించుకోవటం మాత్రమే ఎన్‌వీఎస్ రెడ్డికి తెలుసేమో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ విషయంలో కేసీఆర్‌ నెంబర్ వన్ !

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన...

హతవిధీ… వైసీపీకి ఏమిటీ దుస్థితి..!?

జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం...

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close