జులాయి+ రేసుగుర్రం+ టెంపర్+నాన్నకు ప్రేమతో+ఠాగూర్= హైపర్

మా సినిమాలో కామెడీ కోసం ప్రత్యేకంగా ట్రాక్స్, స్పూఫ్‌లు లేవని ప్రమోషన్స్ టైంలో రామ్ చెప్పాడు. ఆ మాట వాస్తవం కూడా. కానీ స్పూఫ్ అనాలో, కాపీ అనాలో తెలియదు కానీ హైపర్ సినిమా కథ, సీన్స్, క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా కొన్ని సూపర్ హిట్ తెలుగు సినిమాల నుంచి కాపీ కొట్టారన్న విషయం రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు చూసే ప్రేక్షకులందరికీ వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. అన్ని హిట్ సినిమాలను కాపీ కొట్టాడు కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అయిపోతుందని, బాగుంటుందని అనుకునేరు. ఆ కాపీ కొట్టిన కథ, ట్రాక్స్, సీన్స్ అన్నింటినీ బాగా తీసుంటే హిట్ అయి ఉండేదేమో తెలియదు. కానీ ఆ సీన్స్ అన్నింటినీ కూడా హీరో రామ్, డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ అనుకునే…ఊహించుకునే కైండ్ ఆఫ్ ఊర మాస్ స్టైల్‌లో తీశారు. తెలుగు హీరోలు చేసే పిచ్చ ఓవర్ యాక్షన్‌తో చంపేశారు. కాబట్టి రామ్‌తో పాటు ఈ సినిమా తీసిన డైరెక్టర్‌కి అలాగే ఇక మీదట ఇలాంటి సినిమాలు తీయాలనుకునే తెలుగు సినిమా డైరెక్టర్స్, హీరోలకు ఓ గొప్ప లెస్సన్ నేర్పించే సినిమా అయింది హైపర్.

అసలు హైపర్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ హిట్ సినిమాలను కాపీ కొట్టిన విధంబెట్టిదనిన……జులాయి సినిమాలో ఇలియానా క్యారెక్టరైజేషన్ గుర్తుందా? అలాగే ఇలియానాను అల్లు అర్జున్ అల్ట్రా మోడరన్‌గా మార్చే సన్నివేశాలు గుర్తున్నాయా? ఒకవేళ మర్చిపోయి ఉంటే యూట్యూబ్‌లో జులాయి సినిమా చూడండి లేకపోతే హైపర్ సినిమా చూడండి మీకు వెంటనే గుర్తొచ్చేస్తాయి. మధ్యలో ఇలియానాకు, ఇలియానా ఫాదర్‌‌కు వచ్చే సీన్‌తో సహా అన్నింటినీ యాజ్ ఇట్ ఈజ్‌గా కాపీ పేస్ట్ చేశారు. ఆ తర్వాత అదే అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమా బేసిక్ లైన్‌ను, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలన్నింటినీ దించేశారు. కాకపోతే అక్కడ అన్న కోసం, హైపర్‌లో తండ్రి కోసం అంతే తేడా. మిగతాదంతా సేం టు సేం. ఇక టెంపర్ నుంచి నారాయణమూర్తి క్యారెక్టర్‌ని అదే పేరుతో దించేశాడు ఈ కందిరీగ డైరెక్టర్. అలాగే ఠాగూర్‌ సినిమా క్లైమాక్స్‌లో విశ్వనాథ్‌గారి సీన్స్ గుర్తున్నాయా? వాటిని కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా వాడేశాడు. ఈ సినిమాల నుంచి తీసుకున్న అన్ని సీన్స్ విషయంలో యాజ్ ఇట్ ఈజ్‌గా ఒరిజినల్ క్వాలిటీ తీసుకురాలేకపోయాడు కానీ ఇంకొంచెం కష్టపడి కనుక ఆ రేంజ్ అవుట్ పుట్ తీసుకొచ్చి ఉండి ఉంటే ఏకంగా ఓ కొత్త ట్రెండ్‌నే సెట్ చేసిన వాడు అయ్యేవాడు. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ ఫెయిల్ అయ్యాడేమో కానీ భవిష్యత్‌లో ఏదో ఒక తెలుగు డైరెక్టర్ మాత్రం స్పూఫ్ కామెడీలతో వచ్చిన అల్లరి నరేష్ సినిమా సుడిగాడులాగా అన్ని సినిమాల నుంచి ట్రాక్స్, సీన్స్ తీసుకుని సీరియస్‌గానే ఓ సూపర్ హిట్ సినిమాని తీసి పడేసినా ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదు. కాపీ పేస్ట్ చేయాలంటే మన తెలుగు డైరెక్టర్స్ తర్వాతే ఎవ్వరైనా అని మాత్రం ఇలాంటి హైపర్‌లను చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close