నేను దేశం విడిచి పారిపోలేదు: విజయ్ మాల్యా

కింగ్ ఫిషర్ అధినేత మరియు రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా దేశంలో వివిధ బ్యాంకులకు రూ.9,000 కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉంది. బ్యాంకుల నుండి అప్పులు తీర్చమని ఒత్తిడి పెరిగిపోవడం ఈనెల 2వ తేదీన ఆయన లండన్ వెళ్ళిపోయారు. దీనిపై పార్లమెంటులో కూడా నిన్న చర్చ జరిగింది. అలాగే సుప్రీం కోర్టులో కూడా విచారణ జరిగింది. రెండు వారలలోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఆయనకు నోటీసు జారీ చేసింది. ఆయనకు బ్యాంకులు కూడా నోటీసులు జారీ చేయడానికి అనుమతించింది.

ఈ పరిణామాలపై లండన్ లో ఉన్న విజయ్ మాల్యా చాలా ఘాటుగా స్పందిస్తూ ట్వీటర్ లో ఈరోజు రెండు మెసేజులు పెట్టారు. “నేను ఒక అంతర్జాతీయ వ్యాపారవేత్తని కనుక తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటాను. నేనేమీ దేశం విడిచిపారిపోలేదు…పోలీసులను నుంచి తప్పించుకొని తిరగడం లేదు. ఒక ఎంపిగా భారతదేశ చట్టాలను, న్యాయవ్యవస్థలకు లోబడి ఉంటాను వాటిని గౌరవిస్తాను. మన న్యాయవ్యవస్థపై నాకు అపారమయిన నమ్మకం ఉంది. అయితే నా గురించి దేశంలో మీడియా విచారణ చేయడాన్ని అంగీకరించబోను,” అని ట్వీట్ చేసారు.

ఆయన మళ్ళీ భారత్ తిరిగి వస్తారో లేదో, వచ్చి బ్యాంకుల అప్పులను తీరుస్తారో లేదో తెలియదు కానీ ఆయన భారత్ చట్టాలకు, న్యాయవ్యవస్థకు లోబడి ఉంటానని చెప్పడమే గొప్ప విషయం. ఇటువంటి పెద్ద మనుషులు బ్యాంకులకు వెల కోట్లు టోపీలు పెడుతుంటే, వారితో రాజకీయ పార్టీలకు ఉండే ఆర్ధిక, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఉపేక్షిస్తుంటే, చివరికి ఆ భారం కూడా బ్యాంక్ ఖాతలు లేని సామాన్య ప్రజలపైన కూడా పడుతోంది. నిజామాబాద్ ఎంపి కవిత నిన్న లోక్ సభ సభలో మాట్లాడుతూ విజయ్ మాల్యా విషయం ప్రస్తావించి, ఆయన బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకొందని ప్రశ్నించారు. ఆమె ప్రశ్న ప్రజాభిప్రాయానికి అద్దం పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close