శ్రుతిహాస‌న్ ‘చిత్ర‌మైన‌’ కండీష‌న్‌!

సినిమా అంటే ప్రాణం ఇచ్చేస్తాడు క‌మ‌ల్‌హాస‌న్‌. పాత్ర కోసం ఎంత క‌ష్ట‌మైనా ప‌డ‌తాడు, ఎన్ని త్యాగాలైనా చేస్తాడు. అలాంటి న‌టుడి కూతురిగా ఇండ్ర‌స్ట్రీలో అడుగుపెట్టిన శ్రుతిహాస‌న్‌ది మాత్రం డిఫ‌రెంట్ స్కూల్‌. తండ్రిలోని ప్రొఫెష‌న‌లిజం, క‌ష్ట‌ప‌డే గుణం ఆమెకూ అబ్బినా – ఇంకా ఎంతో నేర్చుకోవాల్సివుంది. ఆ ప్ర‌యాణంలో ఉండ‌గానే.. ఇప్పుడు నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపించ‌డం మొద‌లెట్టింద‌ట‌. పారితోషికంలో శ్రుతిహాస‌న్‌కి తిరుగులేదు. మాంఛి డిమాండ్ ఉన్న క‌థానాయిక కాబ‌ట్టి, అడిగినంత ఇవ్వాల్సిందే. అయితే.. ఆమె వెరైటీ కండీష‌న్లు త‌ట్టుకోలేక సెట్లో జ‌నం బిత్త‌ర‌పోతున్నార‌ని టాక్‌.

ఉద‌యం ఎంత ఎర్లీగా అయ‌నా సెట్‌కి వెళ్లిపోయే శ్రుతి.. మ‌ధ్నాహ్యం అయితే సెట్లో ఉండ‌డం లేదట‌. అవుడ్డోర్ షూటింగ్ అంటే.. 12 దాటాక కాలు బ‌య‌ట పెట్ట‌డం లేద‌ట‌. ”మ‌ధ్యాహ్నం షూటింగుల‌కు నేను రాను.. కావాలంటే పొద్దుటే పెట్టుకోండి” అంటూ వెరైటీ కండీష‌న్ పెడుతోంద‌ట‌. ఎండ‌ల కార‌ణంగానే శ్రుతి ఇలా భ‌య‌ప‌డ‌పోతోంద‌ని, అందుకే ఇలాంటి వెరైటీ కండీష‌న్లు పెడుతోంద‌ని టాక్‌. ఎండ‌ల తాకిడికి త‌న గ్లామ‌ర్ ఏమైపోతుందో అని శ్రుతి హ‌డ‌లిపోతోంద‌ట‌. అందుకే మ‌ధ్యాహ్నం షూటింగుల‌కు ఎగ‌నామం పెడుతోంద‌ని తెలుస్తోంది. ఎండాకాలం పోయేవ‌ర‌కు నిర్మాత‌ల‌కు ఈ తిప్ప‌లు త‌ప్ప‌వేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close