గ్రామాల్లో గొడవలు తప్పవా?

వెనకటికి ఎవడో నీ ఎడం చేయి తీయి.. నా పుర్ర చేయి పెడతా అన్నాడట. అలా వుంది ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహారం. గ్రామాల్లో జన్మభూమి కమిటీలకు స్వస్తి చెప్పి, ఆయన రకరకాల వ్యవస్థలను ప్రవేశపెట్టే పనిలో బిజీగా వున్నారు. కానీ దీనివల్ల గ్రామాల పరిస్థితి ఎలా మారే ప్రమాదం వుందన్నది ఊహించడం లేదు.

గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం, గ్రామ సర్వేయర్లు, ఇలా రకరకాల పేర్లతో నియామకాలు చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు గ్రామాల్లో పరిస్థితి ఎలా వుంటుందో చూద్దాం.

గ్రామ పంచాయతీకి సర్పంఛ్ వుంటారు. పంచాయతీ ఇవో వుంటారు. వీరు కాక ఎంపిటీసీ మెంబర్, జెడ్పీటీసీ మెంబర్ ఆ గ్రామంతో రాజకీయ పదవులతో లింక్ అయి వుంటారు. ఇక వీఆర్వో రెవెన్యూ వైపు నుంచి వుంటారు. అంటే అధికారికంగా ఇద్దరు, ప్రజాస్వామ్య పదవులతో ముగ్గురు గ్రామ వ్యవహారాలతో లింక్ అయి వుంటారు. వీరు కాక, పంచాయతీ సభ్యులు వుండనే వుంటారు. చిన్న పంచాయతీ అయినా కనీసం అయిదారుగురు పంచాయతీ సభ్యులు వుంటారు.

ఇప్పుడు వీరు కాకుండా, యాభై మందికి ఒకరు వంతున, అయిదు వందల మందికి ఒకరు వంతున వేరు వేరు పేర్లతో నియామకాలు చేస్తామంటున్నారు. ఏ ఇద్దరి అభిప్రాయానికి పొసగని రోజులు ఇవి. ఏ ఇంట్లోనూ ఒకే పార్టీ వుండని రోజులు ఇవి. పైగా ఇప్పుడు ఇలాగే వున్న పార్టీ అనుబంధాలు ఎప్పటికీ అలాగే వుంటాయని గ్యారంటీ ఏమన్నా వుందా? ఇప్పుడు ఇంతమంది ఓ చిన్న గ్రామంలో అధికార వ్యవహారాలు పర్యవేక్షించడం అంటే పరిస్థితి ఎలా వుంటుంది?

గ్రామాల్లో చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద తగాయిదాలు వస్తుంటాయి. పట్టణాల వ్యవహారాలు వేరుగా వుంటాయి. పల్లెల్లో ఈ వీధికి, ఆ వీధికి కూడా పొసగని పరిస్థితి వుంటుంది. కేవలం కులాలు మాత్రమే కాదు కుటుంబాల లెక్కలు కూడా వుంటాయి పల్లెల్లో. ఒక ఈక్వేషన్ అన్నది పల్లెల్లో వుండదు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలా ఇబ్బడిముబ్బడిగా చిన్న చితక పల్లెల మీదకు జనాలకు అధికారాలు ఇచ్చి నియమించడం అంటే పరిస్థితి భవిష్యత్ లో ఎలా వుంటుందో అన్న డిస్కషన్లు అప్పుడే పల్లెల్లో బయలు దేరాయి. నిజానికి అసలు ఏం జరుగుతోందో? ఏం జరగబోతోందో? అన్నది ఓ అంచనా అన్నది పల్లె జనాల ఊహకు అందడం లేదు. ఇదంతా తలనొప్పి వ్యవహారంగా మారబోతోందన్న ఆలోచన మాత్రం వారిలో కలుగుతోంది.

భవిష్యత్ లో ఇంతమంది పెత్తనం కలిసి, పల్లెల్లో ఎద్దు ఎండకి, ఎనుబోతు నీడకి లాగినట్లు వ్యవహారాలు సాగుతాయన్న భయాందోళనలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close