గెలుపంత కిక్ ఇచ్చిన‌ ‘డ్రా’

టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వ‌డం చాలా సాధార‌ణమైన విష‌యం. కానీ కొన్ని `డ్రా`లు గెలుపంత కిక్ ఇస్తాయి. సిడ్నీ టెస్ట్ లో అలాంటి గెలుపు సొంతం చేసుకుంది భార‌త్‌. ఓట‌మి కోర‌ల్లోంచి బ‌య‌ట ప‌డి… అసాధార‌ణ‌మైన బ్యాటింగ్ తో… టెస్ట్ డ్రా చేసుకుంది. రిష‌బ్ పంత్(97) సూప‌ర్ ఇన్నింగ్స్‌కు తోడు.. పుజారా(77) రాణించ‌డంతో.. ఓ ద‌శ‌లో 407 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. కానీ.. వెనువెంట‌నే పంత్, పుజారా ఔట‌వ్వ‌డంతో… భార‌త్ కి ఓట‌మి భ‌యం ఎదురైంది. ఈ ద‌శ‌లో విహారి(23 నాటౌట్‌), అశ్విన్(39 నాటౌట్‌) అద్భుత‌మైన డిఫెన్స్‌తో.. ఓట‌మి బారీ నుంచి కాపాడారు. ఆరో వికెట్‌కు ఏకంగా 258 బంతులాడి 62 ప‌రుగులు జోడించారు. విహారి 161 బంతులాడి 23 ప‌రుగులు చేశాడు. అశ్విన్ 128 బంతుల్లో 39 ప‌రుగులు చేశాడు.

అస్ట్రేలియా బౌల‌ర్లు ఈ భాగ‌స్వామ్యాన్ని విడ‌గొట్ట‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. ప‌లుమార్లు ఆసీస్ బౌల‌ర్ల బంతులు.. అశ్విన్ ని గాయ‌ప‌రిచాయి కూడా. కానీ గాయాల్ని సైతం లెక్క చేయ‌కుండా.. అశ్విన్ బ్యాటింగ్ కొన‌సాగించాడు. ప‌లుమార్లు క్యాచ్‌లు విడిచిపెట్ట‌డం.. భార‌త్ కు క‌లిసొచ్చింది. మ్యాచ్ డ్రాగా ముగిసే స‌మ‌యానికి టీమిండియా 5 వికెట్ల‌కు 334 ప‌రుగులు చేసింది. ఈ డ్రాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో రెండు టీమ్స్ స‌మ‌వుజ్జీలుగా ఉన్నాయి. 1979 త‌ర్వాత టీమిండియా చివ‌రి ఇన్నింగ్స్‌లో ఇన్ని ఓవ‌ర్ల పాటు ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించ‌డం ఇదే తొలిసారి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close