ఇదేం విచిత్రం: సూర్యుడు ఆపేసిన క్రికెట్ మ్యాచ్‌

వ‌ర్షం వ‌చ్చి మ్యాచ్ ఆగిపోవ‌డం చూశాం. మంచు వ‌ల్ల మ్యాచ్ ఆగిపోవ‌డం చూశాం. వెలుతురు లేక‌పోవ‌డం వ‌ల్ల మ్యాచ్ నిలిచిపోయిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే సూర్యుడి వ‌ల్ల మ్యాచ్ ఆగిపోవ‌డం చూశామా? ఈరోజు అదే జ‌రిగింది.

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జ‌రుగుతున్న‌ తొలి వన్డేకు సూర్యుడు అడ్డు త‌గిలాడు. సూర్య కిర‌ణాలు నేరుగా బ్యాట్స్‌మెన్ క‌ళ్ల‌లో ప‌డ‌డం వ‌ల్ల ఈ మ్యాచ్‌ని తాత్కాలికంగా ఆపేశారు. సూర్యుడి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాల్సి రావడం క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

అంత‌కు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 157 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. అందుకు స‌మాధానంగా బ‌రిలోకి దిగిన భార‌త్ 10 ఓవ‌ర్ల‌కు ఒక వికెట్ కోల్పోయి 44 ప‌రుగులు చేసింది. ఈ స‌మ‌యంలోనే సూర్య కిర‌ణాలు నేరుగా బాట్స్‌మెన్ క‌ళ్ల‌లోకి తాక‌డంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. దాదాపుగా 40 నిమిషాలు ఆట‌కు అంత‌రాయం క‌లిగింది. కాసేప‌ట్లో మ్యాచ్ పునః ప్రారంభం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close