పాక్, అమెరికా దొందుకు దొందే!

అమెరికా, పాకిస్తాన్ ద్వంద వైఖరి ప్రదర్శించడంలో రెండూ ఒకదానికొకటి తీసిపోవు. పాకిస్తాన్ తాము ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నామని చెపుతూనే మళ్ళీ మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తుంటుంది. అమెరికా కూడా ‘భారత్ మా చిరకాల మిత్రదేశం, దానితో మా అనుబంధం విడదీయలేనిది’ అంటూ పడకట్టు డైలాగులు వల్లె వేస్తూనే, భారత్ కి పక్కలో బల్లెంలాగ తయారయిన పాకిస్తాన్ కి ప్రతీ ఏటా లక్షల డాలర్లు నిధులు అందిస్తూ, అత్యాధునికమయిన ఆయుధాలు సరఫరా చేస్తుంటుంది. భారత్ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఇప్పుడు పాకిస్తాన్ కి అత్యాధునికమయిన ఎఫ్-16 యుద్ద విమానాలు అందించబోతోంది. భారత్ కి ధీటుగా పాకిస్తాన్ కూడా తన ఆయుధ సంపత్తిని పెంచుకొనే ప్రయత్నాలలో భాగంగానే వాటిని సమకూర్చుకొంటోందని అందరికీ తెలుసు కానీ అవి ఉగ్రవాదంపై పోరు కోసమేనని అమెరికా రక్షణ కార్యదర్శి ఆష్టన్ కార్టర్ చెపుతున్నారు.

పాకిస్తాన్ స్వయంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నపుడు, ఇంకా వారిపై పోరుకి ఎఫ్-16 విమానాలు ఎందుకు? అయినా పాక్ సేనలు ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేసిన దాఖలాలే లేవు. అమెరికా ట్విన్ టవర్స్ ని కూల్చివేయడానికి కుట్ర పన్నిన ఒసామా బిన్ లాడెన్ కోసం అమెరికా దేశదేశాలు జల్లెడ పడుతుంటే, పాకిస్తాన్ అతనికి సైనిక రక్షణ కల్పించి అమెరికా బారి నుంచి కాపాడిందని ఆష్టన్ కార్టర్ తెలియదనుకోలేము. తమ దేశంపై దాడి చేసిన ఒక భయంకర ఉగ్రవాదికి పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిందని తెలిసినపుడు అమెరికా స్పందన వేరే విధంగా ఉంటుందని అందరూ ఆశిస్తారు. కానీ నేటికీ పాక్ పట్ల అమెరికా సానుభూతితో వ్యవహరిస్తోంది. దానికి అవసరమయిన నిధులు, ఆయుధాలు, యుద్ధవిమానాలు అన్నీ అందిస్తోంది. అందంతా ఉగ్రవాదంపై పోరుకేనని నమ్మమని కోరుతోంది.

అందుకు చాలా బలమయిన కారణమే ఉంది. పాకిస్తాన్ భారత్ కి పక్కలో బల్లెంలాగ ఉన్నంత కాలం భారత్ రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేయక తప్పదు. అప్పుడే అమెరికా తయారు చేస్తున్న ఆయుధాలను భారత్ కి అమ్ముకొని లాభాలు ఆర్జించుకోగలదు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా భారత్ తో పోటీపడుతూ ఆయుధాలు సమకూర్చోకోవాలనుకొంటుంది కనుక దానికి కూడా ఆయుధాలు, యుద్ధవిమానాలు అమ్ముకోగలుగుతుంది.

రక్షణ రంగంపై రెండు దేశాలు పోటాపోటీగా పెట్టుబడి పెడుతునంత కాలం అవి అభివృద్ధి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టలేవు. అప్పుడు కూడా అవి మళ్ళీ అమెరికానే ఆశ్రయించే అవకాశం ఉంది. ఉదాహరణకి మోడీ ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీస్ పధకంలో వైజాగ్ మరికొన్ని నగరాల అభివృద్ధి కోసం అమెరికా సంస్థలకే కాంట్రాక్టులు దక్కేయి. ఈవిధంగా అమెరికా స్నేహం ముసుగులో భారత్ కి, ఉగ్రవాదంపై పోరు అనే ముసుగులో పాకిస్తాన్ కి తన ఆయుధాలను అమ్ముకొంటూ రెండు చేతులా లాభాలు ఆర్జిస్తోంది. ఒకసారి దాని నుంచి ఆయుధాలు కొన్నాక ఇంకా అవి ఉపయోగిస్తున్నంత కాలం వాటి విడిభాగాలు, మరమత్తులు, శిక్షణ వంటి అవసరాలకు అమెరికా మీదే ఆధారపడవలసి ఉంటుంది కనుక ఆవిధంగా అమెరికా మంచి వ్యాపారమే చేసుకొంటోంది. కనుక ఈ వ్యాపారానికి అది
ఏ పేరు పెట్టుకొంటే తేడా ఏమిటి?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close