ఇంగ్లండ్ బాట‌లో.. ఇండియా: 145 ఆలౌట్‌

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ని 112 ప‌రుగులకు ఆలౌట్ చేసిన ఆనందం భారత్ కి ఎంతోసేపు ద‌క్క‌లేదు. ప్ర‌త్య‌ర్థి బాట‌లోనే న‌డిచి కేవ‌లం 145 ప‌రుగుల‌కే భార‌త్ కూడా ఆలౌట్ అయ్యింది. అయితే.. తొలి ఇన్నింగ్స్ లో 33 ప‌రుగుల‌ స్వ‌ల్ప ఆధిక్యాన్ని సంపాదించ‌గ‌లిగింది.

ఈరోజు 3 వికెట్ల న‌ష్టానికి 99 ప‌రుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త్ త్వ‌ర త్వ‌ర‌గా వికెట్ల‌ను కోల్పోయింది. తొలుత అజింక్యా రెహానే (7) వెనుదిరిగాడు. ఆ త‌ర‌వాత‌… రోహిత్ శ‌ర్మ (66) వంతు వ‌చ్చింది. పంత్ (1), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (0), అక్ష‌ర్ ప‌టేల్ (0) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల‌వ‌లేక‌పోయారు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (17) ఒక్క‌డే కాసేపు భార‌త ప‌త‌నాన్ని నిలువ‌రించ‌గ‌లిగాడు. బుమ్రాని రూట్ అవుట్ చేయ‌డంతో.. భార‌త ఇన్నింగ్స్‌కి తెర‌ప‌డింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జాక్ రీచ్‌కి నాలుగు వికెట్లు ద‌క్కాయి, పార్ట్ టైమ్ బౌల‌ర్ రూట్ 5 వికెట్లు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. పిచ్ ప‌రిస్థితి చూస్తుంటే….. ఇక మీద‌ట స్పిన్న‌ర్ల‌కు మ‌రింత గా స‌హ‌క‌రించే అవ‌కాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లో ముగియ‌డం ఖాయం అనిపిస్తోంది. భార‌త్ ముందు ఇంగ్లండ్ ఎంత విజ‌య‌ల‌క్ష్యాన్ని నిర్దేశిస్తుంద‌న్న‌ది ఇప్పుడు కీల‌కం. ల‌క్ష్యం 180 ప‌రుగులు దాటిందంటే.. ఛేదించ‌డం క‌ష్ట‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close