తొలి టీ 20లో.. భార‌త్ బోణీ

ఆసీస్‌తో వ‌న్డే సిరీస్ ని కోల్పోయిన భార‌త్‌…. టీ 20లో శుభారంభం చేసింది. ఈరోజు కాన్‌బెర్రాలో జ‌రిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో 11 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది. టాప్ ఆర్డ‌ర్ విఫ‌ల‌మైన వేళ‌.. రాహుల్ 51 ప‌రుగుల తేడాతో రాణించాడు.చివ‌ర్లో జ‌డేజా చెల‌రేగి 23 బంతుల్లో 44 ప‌రుగులు చేసి, ఆదుకోడంతో భార‌త్ గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ సాధించింది.

అనంత‌రం బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆసీస్ ఓపెన‌ర్లు 56 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పి శుభారంభం ఇచ్చినా, ఆ త‌ర‌వాత భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్ట‌మౌన బౌలింగ్ తో ప్ర‌త్య‌ర్థిని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. ముఖ్యంగా తొలి టీ20 ఆడుతున్న న‌ట‌రాజ‌న్ 30 ప‌రుగులకు 3 వికెట్లు తీసి, భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. చాహ‌ల్ కి మూడు వికెట్లు ద‌క్కాయి. బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు జ‌డేజా గాయ‌ప‌డ‌డంతో… అత‌ని స్థానంలో కండీష‌న్ స‌బ్‌స్ట్యూట్‌గా చాహ‌ల్ బౌలింగ్ కి దిగాడు. రెండో టీ 20 ఆదివారం జ‌ర‌గ‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close