హ‌మ్మయ్య‌… ఇండియా గెలిచింది

ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ కి తొలి విజ‌యం. వ‌రుస‌గా రెండు భారీ ఓట‌ములు మూట‌గ‌ట్టుకుని వ‌న్డే సిరీస్ ని కోల్పోయిన టీమ్ ఇండియా.. మూడో వ‌న్డేలో గెలిచి ప‌రువు నిల‌బెట్టుకుంది. ఆసీస్‌పై 13 ప‌రుగుల తేడాతో విజ‌యం అందుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌కు 5 వికెట్ల న‌ష్టానికి 302 ప‌రుగులు చేసింది. 92 ప‌రుగులు చేసిన పాండ్యా టాప్ స్కోర‌ర్‌. జడేజా 66, కోహ్లి 63 పరుగులతో రాణించారు. పాండ్యా, జడేజాలు కలిసి ఆరో వికెట్‌కు 150 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెల‌కొల్పారు. టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌లో ఈ భాగ‌స్వామ్య‌మే హైలెట్.

303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటింగ్‌లో ఆరోన్‌ ఫించ్‌ 75 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్‌ 59 పరగులతో రాణించాడు. ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్స్‌వెల్‌, అలెక్స్‌ క్యారీలు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. జట్టు స్కోరు 268 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ అవుట్‌ కావడంతో మ్యాచ్‌ టీమిండియా వైపు మొగ్గింది. ఆ తర్వాత కాసేపటికే 28 పరుగులు చేసిన ఆస్టన్‌ అగర్‌ అవుట్‌ కావడంతో భారత్‌ విజయం ఖాయమైంది. ఇక బౌలింగ్‌లో శార్ధూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీయగా, తొలి మ్యాచ్‌ ఆడిన నటరాజన్‌ 2 వికెట్లు, బుమ్రా, జడేజా, కుల్దీప్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close