హైలైట్స్ : రైల్వే బడ్జెట్

రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు కొద్ది సేపటి క్రితం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు:

  1. బడ్జెట్: రూ. 1.21 వేల కోట్లు.
  2. 2016-17 ఆదాయ లక్ష్యం రూ. 1,84, 820 కోట్లు.
  3. రోజుకి కనీసం ఏడు కిమీ కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం చేయాలనే లక్ష్యం
  4. వచ్చే ఏడాదిలోగా 2,000 కిమీ రైల్వే మార్గాలు విద్యుదీకరణ చేయడం.
  5. గుజరాత్ లోని వడోదరాలో ఇండియన్ రైల్వే అకాడమీ (యూనివర్సిటీ) ఏర్పాటు.
  6. ఈ టికెటింగ్ విధానంలో ప్రస్తుతం నిమిషానికి 2000 టికెట్లు జారీ అవుతున్నాయి. వాటిని 7200 కి పెంచడం.
  7. ఈ ఏడాదిలోనే వివిధ రైళ్ళలో 17,000 బయో-టాయిలెట్ల ఏర్పాటు.
  8. చెన్నై లో రైల్వే ఆటో హబ్ ఏర్పాటు.
  9. హెల్ప్ లైన్ నెంబర్: 13ద్వారా రైల్వే టికెట్ల క్యాన్సిలేషన్ సౌకర్యం
  10. దేశ వ్యాప్తంగా కొత్తగా 1700 ఆటోమేటిక్ టికెట్ అమ్మకాల యంత్రాల ఏర్పాటు.
  11. దేశ వ్యాప్తంగా కొత్తగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో 2500 ఆటోమేటిక్ మంచి నీళ్ళ అమ్మకాల యంత్రాల ఏర్పాటు.
  12. 50 ఏళ్ల వయసు పైబడిన వారికోసం లోవర్ బెర్త్ కోటా పెంచబడుతుంది.
  13. కొత్తగా మరో 100 స్టేషన్లలో వైఫీ సౌకర్యం ఏర్పాటు.
  14. జర్నలిస్టులకు ఈ-బుకింగ్
  15. పసిపిల్లలకు, చిన్న పిల్లలకు కూడా రైళ్ళలో ప్రత్యేక ఆహారం (బేబీ ఫుడ్) అందిస్తాము.
  16. రైల్వే కంపార్టుమెంటుల శుభ్రం చేయమని కోరేందుకు (క్లీన్ మై కోచ్ ఆన్ డిమాండ్) వీలుగా ప్రత్యేక ఫోన్ నెంబర్ ఏర్పాటు.
  17. అంగవైకల్యం కలిగిన వారి కోసం రైళ్ళలో ప్రత్యేక టాయిలెట్లు.
  18. వచ్చే ఐదేళ్ళలో రైల్వేల అభివృద్ధి కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.
  19. రద్దీగా ఉండే రైలు మార్గాలలో రాత్రిపూట డబుల్ డక్కర్ రైళ్ళను నడిపించబడతాయి.
  20.      బాగా రద్దీ ఉండే రైల్వే మార్గాలలో అంత్యోదయ పేరుతో సుదూర ప్రాంతాలను కలిపే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రవేశపెట్టబడతాయి.
  21. దేశంలో పుణ్యక్షేత్రాలను కలుపుతూ ‘ఆశ’ పేరుతో కొత్తగా రైళ్ళు.
  22. పుణ్యక్షేత్రాలు- తిరుపతి, గయా, వారణాసి, పూరి, మథుర, నాశిక్, నాందేడ్, నాగపట్టణం,
  23. అమ్రిత్ సర్, తదితర రైల్వే స్టేషన్ల సుందరీకరణ
  24. రైల్వే కూలీలను ఇకపై ‘సహాయక్’ అని పిలవబడతారు. వారి గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా వారి యూనిఫార్మ్ కూడా మార్చబడుతుంది. ప్రయాణికులతో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపై వారిలో అవగాహన పెంచేందుకు వారికి సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వబడుతుంది.
  25. పెట్రోలియం సంస్థల నుండి నేరుగా డీజిల్ కొనుగోలు చేయడం ద్వారా రూ. 1500 కోట్లు పొదుపు చేయబడుతుంది.
  26. రైల్వే బోర్డు యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేసి బోర్డు చైర్మన్ కి మరిన్ని అధికారాలు కట్టబెట్టబడతాయి.
  27. ఎంపిక చేసిన ఐదు రైల్వే ఆసుపత్రులలో ‘ఆయుష్ విధానం’ ప్రవేశపెట్టబడుతుంది.
  28. ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ల ద్వారా రైళ్ళలో ప్రయాణికులకు వినోదం కల్పించేందుకు ఆహ్వానం.
  29. అన్ని రకాల రిజర్వేషన్ కోటాలలో మహిళలకు 33 శాతం సబ్ కోటాగా కేటాయింపు.
  30. 2018 నాటికి కోల్ కత మెట్రో రైల్ నిర్మాణం పూర్తి చేయబడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close