అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్‌లను వదిలేస్తున్న తెలుగు విద్యార్థులు

హైదరాబాద్: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న తెలుగు విద్యార్థులు పలువురు ఆ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాల ఎఫెక్ట్‌తోనే వారు ఇలా చేస్తున్నారని తెలిసింది. స్టూడెంట్ వీసాలపై వెళ్ళిన విద్యార్థులు, తాము అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తామని చెబుతుండటంతో ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి పంపేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో తమ వీసాలకు కూడా ముప్పు వస్తుందనే భయంతో ఇప్పటికే అక్కడ ఉంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్యాస్ స్టేషన్‌లు(పెట్రోల్ బంకులు), సూపర్ మార్కెట్‌లు, రెస్టారెంట్‌లలో మన విద్యార్థులు గంటకు 5-6 డాలర్ల జీతానికి పార్ట్ టైమ్ జాబ్‌లు చేస్తుంటారు. ఇప్పుడు వాటన్నింటినీ వదిలేస్తున్నారు. డీపోర్టేషన్ భయంతో యూనివర్సిటీ లెటర్స్, తమ ఆర్థిక వివరాలు, ఇతర కీలక పత్రాలన్నింటినీ దగ్గర పెట్టుకుని తిరుగుతున్నారు. అయితే ఇటీవల అమెరికా అధికారులు మాత్రం పార్ట్ టైమ్ జాబ్స్ చేసే విద్యార్థులపై కన్నేసి ఉంచారని, ఇటీవల ఒక విద్యార్థి అలాంటి పార్ట్ టైమ్ జాబ్‌కు రాజీనామా చేసిన తర్వాత కూడా అతను చేసిన జాబ్ వివరాలన్నింటినీ పట్టుకుని అతనిని పంపించేశారని తెలిసింది. అమెరికాలోని చాలా యూనివర్సిటీలు విద్యార్థులు అక్రమంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నా పట్టించుకునేవి కావని, అయితే ప్యారిస్‌లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడి తర్వాత అమెరికా అధికారులు నిబంధనలను కఠినతరం చేశారని చెబుతున్నారు. విద్యార్థులను ఇకనుంచి ఎక్కడపడితే అక్కడకు ఫ్రీగా తిరగనీయగూడదని అధికారులు నిర్ణయించారని, విద్యార్థులను బాగా స్క్రూటినీ చేస్తున్నారని, యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థుల అటెండెన్స్‌ను కూడా తనిఖీ చేస్తున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close