డొంకతిరుగుడు……వెంకయ్య, బాబులకు జగన్ ఏం తీసిపోయాడు?

రాజకీయాలు నిజాయితీగా చేస్తా అనేది జగన్ తరచుగా చెప్పే మాట. చంద్రబాబు అబద్ధాలు చెప్తూ ఉంటాడు, మాట మీద నిలబడడు, అన్నీ డొంకతిరుగుడు, వెన్నుపోటు వ్యవహారాలు అని కూడా జగన్ తరచుగా విమర్శిస్తూ ఉంటాడు. ఇక బిజెపితో బంధం ఉన్న నేపథ్యంలో వెంకయ్య గురించి జగన్ పెద్దగా మాట్లాడడు కానీ బొంకడం విషయంలో ఎప్పుడో మాస్టర్ డిగ్రీ చేశాడు వెంకయ్య. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి ప్రాణాధారం…పదేళ్ళపాటు ఇవ్వాల్సిందే అని మాటలు చెప్పి ఓట్లు కొల్లగొట్టేది వెంకయ్యే. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా వళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అథఃపాథాళానికి వెళ్ళిపోతుంది? అని అరిచిగోల పెట్టేది వెంకయ్యే. అట్టే మాట్లాడితే ప్రత్యేక హోదా గురించి అడిగింది నేను ఒక్కడినే అని కూడా దబాయించడం వెంకయ్య స్టైల్. అదేదో కథలో పిసినారి వాడు డబ్బుల గలగల శబ్ధం వినిపించి….సంతోషపడ్డావు కదా ఇక వెళ్ళు అని డబ్బులిస్తాడేమోనని ఆశగా చూస్తున్నవాడికి హ్యాండ్ ఇచ్చి పంపించినట్టన్నమాట. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, వెంకయ్య, మోడీ, పవన్ కళ్యాణ్, టిడిపి భజన మీడియా అంతా కలిసి జనాలను సంతోషపెట్టే ఎన్నో విషయాలను చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ జనాలందరూ అంతటితో సంతృప్తి చెందాలన్నమాట. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే….ఆ మోసం గురించి అస్సలు మాట్లాడకూడదన్నమాట. అదీ బాబు అండ్ కో సిద్ధాంతం.

ఇక ఇఫ్పుడు వైఎస్ జగన్ కూడా జనాలకు అదే డ్రామా చూపించాడు. ప్రత్యేక హోదా ఒక్క విషయంలో మాత్రమే మోడీని వ్యతిరేకిస్తాడట. ఇక మిగిలిన అన్ని విషయాల్లోనూ మద్ధతు ఇస్తాడట. ఇదేదో మోసం, ద్రోహం చేసిన విషయంలో మాత్రమే అతనిని నేను ద్వేషిస్తా. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ అతనికి అండగా ఉంటా, అతను గెలిచేలా చేస్తా అని చెప్పినట్టుగా లేదు. వాహ్…….జగన్ మాటలు వింటుంటే ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి ఇలాంటి గొప్పవాడినా ఇన్నాళ్ళూ టిడిపి నాయకులు విమర్శించారు అని అనిపించడం లేదు. ఇదే విషయం మనుషులందరూ అనుసరిస్తే ఇక గొడవలే ఉండవుగా. అలాగే మోడీ కూడా టెర్రరిస్ట్‌ దాడుల విషయంలో మాత్రమే పాక్‌ని వ్యతిరేకిస్తా…….ఇక మిగతా అన్ని విషయాల్లోనూ పాకిస్తాన్ అద్భుతంగా అభివృద్ధి చెందేలా సపోర్ట్ చేస్తా అని ఒక పాలసీ డెసిషన్ ప్రకటించెయ్యొచ్చు. కాకపోతే ఈ స్థాయి మంచితనం చంద్రబాబు విషయంలో జగన్‌కి ఎందుకు ఉండదు అన్నదే ప్రశ్న. రుణమాఫీలాంటి హామీలు అమలు చేయనందుకు మాత్రమే బాబుని వ్యతిరేకిస్తా…..ఇక మిగతా అన్ని విషయాల్లోనూ బాబుకు మద్ధతిస్తా అని ఎందుకు చెప్పడు? కనీసం ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు కూడా ఎందుకు వెళ్ళలేదు?

ఇక ఓడిపోతామని తెలిసీ కూడా దేశంలో ఉన్న బిజెపి వ్యతిరేక పక్షాలు పోటీ పెట్డం వేస్ట్ అని చెప్పి కూడా జగన్ ఓ మాట చెప్పాడు. అద్భుతః……మోడీ ఫుల్లుగా ఖుషీ అయి ఉంటాడు. ఇక జగన్ కేసులు ఈ జన్మకు తేలవు. కాకపోతే ఇక్కడ జగన్ రాజకీయ విధానాలను మాత్రం ప్రశ్నించాలి. ఓడిపోతామని తెలిసి స్పీకర్‌పైనా, ప్రభుత్వంపైనా ఎందుకు అవిశ్వాసం పెట్టాడు జగన్? అప్పుడు ఈ మాటలు గుర్తులేవా? ఇలాంటి మాటలన్నీ చెప్పి ఇంకాస్త ఇమేజ్ డ్యామేజ్ చేసుకునే బదులు మోడీకి ఎందుకు మద్ధతుగా నిలవాల్సి వస్తుంది అనే విషయాన్ని సూటిగా చెప్పి ఉంటే కాస్త బెటర్‌గా ఉండేదేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close