తెలకపల్లి వ్యూస్ : నువ్వునేను సినిమా లాంటి కధ పీటర్‌ ఇంద్రాణి

నువ్వునేను సినిమాల కాలం గుర్తుందా? మనసంతా నువ్వే తర్వాత ఉదయ కిరణ్‌కు చాలా పేరు తెచ్చిన నువ్వునేను .. దర్శకుడుగా తేజకు మలి విజయం.. చలో అసెంబ్లీ కాన్సెప్ట్‌ను ప్రేమతో ముడిపెట్టిన ప్రయత్నం. అది అలా వుంచితే ఆ చిత్రంలో ప్రధానాంశం కుబేరుడైన హీరో తండ్రి మరో వివాహిత మహిళ మిసెస్‌ మెహతాతోతో గడుపుతూ ఆమె కూతురునే కొడుక్కు చేసుకోవాలనుకోవడం.. దీనిపై ఆ కుర్రాడు కాస్త అసహ్యం ప్రదర్శిస్తే గొప్ప వాళ్ల ఇళ్లలో ఇవి మామూలే అంటాడు.

గత ఏడాదిగా ఇంద్రాణి పీటర్‌ ముఖర్జీల నేర ప్రహసనం చూస్తుంటే ఆచిత్రంలో మాటలే గుర్తుకు వస్తాయి. విలాస జీవితం కోసం కన్న బిడ్డ షీనా బోరాను చెల్లెలిగా పరిచయం చేసిన ఇంద్రాణి ఆమె తన మలిభర్త కుమారుడు రాహుల్‌ను ప్రేమించడం ఇష్టం లేక మాజీ భర్తతో కలిపి చంపించింది. 2012లో జరిగిన ఈ ఘోరం నాలుగేళ్ల తర్వాత అనుకోకుండా బయిటకు వచ్చింది. మన సమాజం దిగజారిపోయిందని అర్థమైన వాళ్లకు కూడా మరీ ఇంత నీచంగా మారిందా అని గగుర్పాటు కలిగించింది.

వీరిద్ధరూ ఒక ప్రముఖ చానల్‌ బాసులు కావడం ఇక్కడ మరింత తీవ్రమైన విషయం.ఇంద్రాణి సరే ఇప్పటికే నిందితురాలిగా వుంది. ఆమెను చేసుకున్న పీటర్‌ ముఖర్జీ పాత్రపైనే రకరకాల సందేహాలు. ఆయనకు ఇదంతా తెలియదనీ తెలుసనీ ఏదో ఆర్థిక కారణం ఈ నేరం వెనక వుందని అనేక కథలు. తాజాగా ఆయన తరపు న్యాయవాది ఆజాద్‌ పొందార్‌ కోర్టులో మాట్లాడుతూ తన క్లయింట్‌కు ఆ ఇద్దరి ప్రేమపై అభ్యంతరం లేదనీ, ఇంద్రాణిని నమ్మడం వల్లనే ఇదంతా జరిగిందని వాదించారు. పైగా ఈ వ్యవహారంలో ఇంద్రాణి ముఖర్జీ దేవన్‌ భట్రి అని ఐపిఎస్‌ అధికారితోనూ ఒక సైకియాట్రిస్టుతోనూ కూడా మాట్లాడేదని వారినీ విచారించాలని కోరారు. మొత్తానికి ఈ కేసులన్నీ ఎటుపోతున్నట్టు? నాగరిక విలువలు ఎక్కడున్నట్టు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close