ఆ ఎమ్మెల్యేకు కండువా కప్పలేకపోయిన జగన్..! పిఠాపురంలో పోయిన పరువు..!

టీడీపీ నేతలు వరుసగా వైసీపీలో చేరిపోతున్నారని మైండ్ గేమ్ ఆడేందుకు.. వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ప్రతి ఒక్కరి “విలువ”ను గుర్తిస్తోంది. దాంతో.. చాలా మంది ఒత్తిళ్లకు గురై.. కుండువా కప్పించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. జగన్ అండ్ పార్టీ బృందం దృష్టి… టీడీపీ టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మల్యే… పులవర్తి నారాయణమూర్తిపై పడింది. ఆయన తూ.గో జిల్లా పి.గన్నవరంకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే. పి.గన్నవరం టికెట్ చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నారాయణ మూర్తిని కాదని స్టాలిన్ అనే కొత్త వ్యక్తికి ఇచ్చారు. దీంతో నారాయణమూర్తి అసంతృప్తికి గురయ్యారు. వెంటనే వైసీపీ నేతలు టచ్‌లోకి వచ్చారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ సహా.. చాలా హామీలిచ్చారు. ఒత్తిడి చేశారు. చివరికి నారాయణమూర్తి అంగీకరించారు.

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రోడ్ షోకు జగన్ వస్తారని.. అక్కడ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. పిలిచినట్లుగానే నారాయణమూర్తి ఆయన వద్దకెళ్ళారు. బస్సు ఎక్కి ప్రజలకూ..జగన్‌కూ అభివాదం చేసారు. ఆయన వైసీపీలో చేరుతున్నట్టు వైసీపీ నేతలు మైకులో ప్రకటన చేశారు. జగన్ కండువా కప్పబోయారు. కానీ నారాయణమూర్తి అడ్డుకున్నారు. రెండో సారి కూడా జగన్ బలవంతంగా కండువా వేయబోయినా ప్రతిఘటించారు. గట్టిగా కండువాను పక్కకు తోసేశారు. జగన్ ఒప్పజెప్పబోయినా…ఆయన వినలేదు. దీంతో షాకయిన జగన్ కండువా పక్కనున్న నేత చేతిలో పెట్టి నారాయణమూర్తిని పంపేయాల్సోందిగా అసహనంగా వైసీపీ నేతలకు సైగలు చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా నారాయణమూర్తి మరోసారి ప్రజలకు అభివాదం చేసి దిగి వచ్చేశారు.

కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరేందుకు వచ్చానని… కానీ పునరాలోచన చేశానని చెప్పుకున్నారు. చంద్రబాబు తనకు అంత అన్యాయం ఏం చేయలేదన్నారు. జగన్ సమక్షంలోనే ఇలా జరగడంతో జిల్లా వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. జగన్ కూడా జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వైసీపీ నేతల పరువు మాత్రం పోయినట్లయింది. ఇష్టం లేని నేతల్ని ఒత్తిడి తెచ్చి.. పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తే ఇలానే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజధాని తరలింపుపై కొత్త కదలికలు నిజమేనా..!?

రాజధాని తరలింపు బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టడంపై.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకు ముందు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ ఆలస్యం అవుతూండటంతో.. సుప్రీంను ఆశ్రయించారు....

కాపు నేస్తం పథకం దుర్వినియోగం

కాపులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చానంటూ.. కాపు నేస్తం అనే పథకాన్ని పెట్టిన ఏపీ సర్కార్.. ఆ పథకం పేరుతో రెడ్డి సామాజికవర్గానికి సాయం చేశారన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. దానికి...

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనన్న కేఆర్ఎంబీ..!

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో.. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తి పోసుకునే ప్రాజెక్ట్‌కు.. రూపకల్పన చేసిన ప్రభుత్వం.. దానికి అభ్యంతరాలు రాకుండా.. చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయింది. చివరికి కృష్ణా బోర్డును...

22న ఏపీలో ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణం..!

రాజ్యసభకు ఎన్నికయిన పిల్లి, మోపిదేవి స్థానాల్లో ఇద్దరు కొత్త మంత్రులను.. ఏపీ కేబినెట్‌లోకి ఇరవై రెండో తేదీన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పెద్దలు ముహుర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close