రాహుల్‌గాంధీ: అమాయకత్వమా? అతి తెలివితేటలా?

దేశంలో ఏ దుర్ఘటన జరిగినా ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ మీద బురద చల్లడానికి దాన్ని వాడుకోవాలని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ప్రయత్నించడం అనేది చాలా సహజమైన విషయం. సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటనకు సంబంధించి, అందులో ‘దళిత’ ఎలిమెంట్‌ కూడా ఉండడంతో.. ఇక దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ దీనిమీద విపరీతంగా కాన్సంట్రేట్‌ చేశాయి. చూడబోతే.. వీరందరికంటె ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీ వారు మాత్రం.. మోడీ సర్కారును దళిత వ్యతిరేకిగా, వ్యక్తి స్వేచ్ఛను హరించే ప్రభుత్వంగా భ్రష్టు పట్టించడానికి తమ చేతికి లడ్డూ లాంటి అవకాశం దొరికి వచ్చిందని మురిసిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

రోహిత్‌ వ్యవహారంలో రాహుల్‌ గాంధీ కూడా చాలా శ్రద్ధగా పోరాడుతున్నారు. రోహిత్‌ జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఆయన హైదరాబాదుకు వచ్చి, సెంట్రల్‌యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న మహాదీక్షలో కూడా పూర్తిరోజు సమయం వెచ్చించి పాల్గొన్నారు. మళ్లీ ఈ దీక్షకు రాజకీయ ముద్ర రాకుండా.. తన పార్టీ నాయకులు ఉత్తంకుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క వస్తే.. వారిని వెనక్కు పంపేశారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ప్రసంగంలో మాట్లాడిన విషయాలే… రాహుల్‌ గాంధీ అవగాహన, పరిజ్ఞానం గురించి ప్రజలకు సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీకి జరిగిన తీరులోనే, ఇక్కడ రోహిత్‌కు కూడా అవమానం జరిగిందంటూ రాహుల్‌ గాంధీ ఈ ఇద్దరికీ లింకు పెట్టేశారు. గాంధీ మరణించిన రోజు, రోహిత్‌ జన్మదినం ఒకే రోజు కావడం బహుశా రాహుల్‌కు ప్రసంగం రాసిచ్చిన వారికి ఈ ఐడియాను అందించినట్లుంది. సత్యాన్ని నినదించే హక్కును రోహిత్‌ లేకుండా చేశారని, మంచి మేధావిని పొట్టన పెట్టుకున్నారని రాహుల్‌ ఆక్రోశించారు. రోహిత్‌ ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన, ఆ కుటుంబానికి జరిగిన నష్టం విషయంలో ఎవ్వరికీ ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. అయితే.. దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీకి ఎందురైన వివక్షతో దీనిని ముడిపెట్టడం అనేది రాహుల్‌గాంధీ అనుసరిస్తున్న చవకబారు రాజకీయ టెక్నిక్కులకు నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది. (ఇంకానయం.. మరో గాంధీని మనం కోల్పోయాం.. అంటూ రోహిత్‌ను ఆయన గాంధీజీ సరసకు చేర్చేయలేదు.!!)

రాహుల్‌గాంధీ చరిత్ర గురించి, ప్రస్తుత పరిణామాల గురించి అవగాహనలేక అలా మాట్లాడుతున్నారా? లేదా, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనే అతి తెలివితేటలతో అలా మాట్లాడుతున్నారా? అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. రాహుల్‌గాంధీది అమాయకత్వం అయితే మనకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇలాంటి అమాయకుడు, అవగాహన లేని నాయకుడు భవిష్యత్తులో ప్రధాని అయినా సరే.. ఇంతకంటే పప్పుసుద్ద ప్రధానులు గతంలో చాలా మంది ఉన్నారులెద్దూ అని సరిపెట్టుకోవచ్చు. కానీ రోహిత్‌ మరణం ద్వారా కేవలం హైదరాబాదు మాత్రమే కాదు కదా.. దేశవ్యాప్తంగా దీనిద్వారా పొలిటికల్‌ మైలేజీ మూటగట్టుకోవాలని రాహుల్‌ ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. రోహిత్‌ మృతి ని నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకువెళుతూ దేశవ్యాప్తంగా యూనివర్సిటీ విద్యార్థులతో ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎన్‌ఎస్‌యూఐ పూనుకోవడం కూడా ఈ విషయాన్నే తెలియజెబుతోంది.

మామూలుగా ‘శవరాజకీయాలు’ అనే మాట కూడా మనకు రాజకీయం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా చనిపోతే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం, వారు శవరాజకీయాలు చేస్తున్నారంటూ పాలకులు దెప్పిపొడవడం అలవాటుగా జరుగుతుంటుంది. దాని వల్ల ఆ పదానికి ఉండే సీరియస్‌నెస్‌ కూడా పోయింది. అది కాస్తా పడికట్టు పదంగా, మొక్కుబడి విమర్శగా మారిపోయింది. కానీ రాహుల్‌గాంధీ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుచూస్తే మాత్రం ‘శవరాజకీయలు’ చేస్తున్నారనే మాట తప్ప మరొకటి స్ఫురించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close