సునీల్‌కి అదేం పిచ్చి??

అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న సునీల్‌కి ఉంగ‌రాల పిచ్చ‌ట‌. ప‌ది వేళ్ల‌కు ప‌ది రంగురాళ్ల ఉంగ‌రాలు పెట్టుకొని తిరుగుతుంటాడ‌ట‌. ఏ రాయి లో ఏముందో అనుకొంటూ.. క‌నిపించిన ప్ర‌తీ రాడునీ ఉంగ‌రంగా మార్చేసుకొంటాడ‌ట‌. దాని కోసం ల‌క్ష‌లు లక్ష‌లు ఖ‌ర్చు పెడుతున్నాడ‌ట‌. అయితే… ఇదంతా నిజం కాదు లెండి. ఓ సినిమాలో సునీల్ క్యారెక్ట‌ర్ ఇది. సునీల్ క‌థానాయ‌కుడిగా క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఇటీవ‌లే కొబ్బ‌రికాయ్ కొట్టుకొంది క‌దా? ఆ సినిమాలో సునీల్ క్యారెక్ట‌ర్ ఇలా ఉంటుంద‌న్న‌మాట‌. అందుకే ఈసినిమాకి ‘ఉంగ‌రాల రాంబాబు’ అనే ఫ‌న్నీ టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ టైటిల్ అటు క‌థ‌నీ, ఇటు సునీల్ ఇమేజ్‌కి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఫీల్ గుడ్ సినిమాలు తీసే.. క్రాంతిమాధ‌వ్ ఇప్పుడు సునీల్ కోసం తొలిసారి కామెడీ జోన‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడ‌న్న‌మాట‌. మ‌రి ఈ క‌థ‌, ఈ టైటిల్ ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియాలంటే.. ఇంకొద్ది రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com