త‌మ‌న్నాకి రూ.70 కోట్లా..? న‌మ్మాలా??

మా సినిమాకి ఇంత భారీ బ‌డ్జెట్ అయ్యిందోచ్ అంటూ నిర్మాత‌లు డ‌ప్పులు కొట్టుకోవ‌డం మామూలే. పావ‌లా పెడితే… పాతిక రూపాయ‌ల బిల్డ‌ప్పు ఇస్తారు. తీరా సినిమా చూస్తే… `ఈ సినిమాకి అంత ఖ‌ర్చు అయ్యిందా?` అనిపిస్తుంది. త‌మ‌న్నా సినిమాకీ ఇప్పుడు అలాంటి క‌ల‌రింగులే ఇస్తున్నారు. త‌మ‌న్నా క‌థానాయిక‌గా విజ‌య్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌భుదేవా కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ‘అభినేత్రి’ అనే పేరు కూడా ఫిక్స్ చేశారు.

అయితే ఈ సినిమా రూ.70 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది.. అంటూ నిర్మాత‌లు అప్పుడే బిల్డ‌ప్పులు ఇవ్వ‌డం మొద‌లెట్టారు. త‌మన్నా స్టార్ హీరోయినే కావొచ్చు. కానీ సోలోగా చేస్తున్న తొలి సినిమా. ఆ అమ్మ‌డిపై రూ.70 కోట్ల తో సినిమా తీయ‌డం అన్న‌ది న‌మ్మ‌శ‌క్య‌మైన విష‌యం కాదు. పైగా ఇదో హార‌ర్ సినిమా. హార‌ర్ చిత్రాల‌న్నీ ఓ ఇంటి చుట్టూ న‌డిచే క‌థ‌లే. అభినేత్రి కూడా అంతే కావొచ్చు. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ఎంత ఖ‌ర్చు పెట్టినా రూ.70 కోట్లు అవ్వ‌డం అసాధ్యం. త‌మ‌న్నాని న‌మ్ముకొని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంత ధైర్యం చేస్తార‌నుకోవ‌డం కూడా అవివేకం. ఓ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వ‌డం మామూలే. కానీ.. మ‌రీ ఇంత టూమ‌చ్‌గానే అని అప్పుడే కామెంట్లు వినిపించ‌డం మొద‌లైపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com