‘ఆచార్య‌’కీ సెగ త‌ప్ప‌దా?

`వ‌కీల్ సాబ్` Vs జ‌గ‌న్ ప్ర‌భుత్వం… అన్న‌ట్టు త‌యారైంది ఏపీలో ప‌రిస్థితి. ఏపీలో వ‌కీల్ సాబ్‌ టికెట్ రేట్లు పెంచుకోవ‌డానికీ, అద‌న‌పు షోల‌కూ…. అడ్డుక‌ట్ట వేసింది. దాంతో.. ఏసీ వ‌సూళ్ల‌లో గ‌ణ‌ణీయ‌మైన తేడా క‌నిపించ‌బోతోంది. ఎక్స్‌ట్రా షోలూ, టికెట్ రేట్ల పెంపుద‌ల ఉంటుంద‌న్న ఆశ‌తో.. బ‌య్య‌ర్లు భారీ రేట్ల‌కు ఈ సినిమాని కొన్నారు. ఈసినిమా అనే కాదు. `ఆచార్య‌` కూడా ఇంతే. ఏపీలో క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో `ఆచార్య‌` బిజినెస్ జ‌రిగింది. బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌ల పెంపు సౌల‌భ్యం ఉంద‌న్న ధీమాతోనే బ‌య్య‌ర్లు ఈ సినిమాల్ని కొన్నారు.

వ‌కీల్ సాబ్ కి అడ్డుప‌డి, ఆచార్య‌కు ఏపీలో గ్రీన్ సిగ్న‌ల్ ల‌భిస్తుంద‌నుకోవ‌డం అత్యాస‌. ఎందుకంటే… అన్ని సినిమాల్నీ,అంద‌రు హీరోల్నీ స‌మాన‌మైన దృష్టిలోనే చూస్తున్నాం – అని చెప్పుకోవ‌డానికైనా, `ఆచార్య‌`కూ ఇవే నిబంధ‌న‌ల్ని వ‌ర్తింప‌జేస్తారు. చిరుకీ, జ‌గ‌న్ కీ మంచి స్నేహం ఏర్ప‌డుతోందిప్పుడు. జ‌గ‌న్ చిత్ర‌సీమ‌కు ఏ కొంచెం మంచి చేసినా చిరు `ఆహా` అంటూ ట్వీట్ చేసేస్తున్నారు. చిరు సినిమా క‌దా, అని చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయ‌డం కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి క‌ష్ట‌మే. కాబట్టి వ‌కీల్ సాబ్ అనే కాదు, భ‌విష్య‌త్తులో ఏ పెద్ద సినిమా వ‌చ్చినా – ఇవే నిబంధ‌న‌లు వ‌ర్తింప‌జేస్తారు. కాబ‌ట్టి ఏపీలో తొలి మూడు రోజుల్లోనే వ‌సూళ్లు లాగేద్దాం అనుకునే నిర్మాత‌ల‌కు ఇది పెద్ద దెబ్బ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close