నీతి ఆయోగ్ భేటీలో ప్రధానిపై తిరుగుబాటు..! విపక్ష సీఎంలు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా…?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ…. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా వెళ్తున్నారంటూ.. విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు చాలా రోజులుగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. ప్రధానమంత్రి వ్యవహారశైలి కూడా అంతే ఉంది. అత్యధిక రాష్ట్రాల్లో తమ పార్టీకి చెందిన ప్రభుత్వాలే అధికారంలో ఉండటంతో… ఆ అసంతృప్తి తీవ్ర స్థాయిలో బయటకు రావడం లేదు. రాష్ట్రాలను నిర్వీర్యం చేసి.. పెత్తనమంతా.. కేంద్రం చేతుల్లో పెట్టుకునేలా.. వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ… వెళ్తున్నారనేది మోదీపై… విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పదిహేనో ఆర్థిక సంఘం విధివిధానాలు పూర్తిగా రాష్ట్రాల హక్కులను హరించేవిగా ఉండటంతో ధైర్యం చేసిన దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై పోరాటం ప్రారంభించాయి. కానీ ఈ రాష్ట్రాల ఆవేదన మోదీ ముందు అరణ్యరోదనే అయింది. మోదీ పట్టించుకోవడం లేదు.

కానీ ఇప్పుడు ఈ విపక్ష పార్టీల ముఖ్యమంత్రులందికీ అద్భుతమైన అవకాశం వచ్చింది. అదే నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశం. నరేంద్రమోదీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎంలందరూ ఈ సమావేశాన్ని తమకు తమకు అనుకూలంగా మరల్చుకుని… ప్రధానిగా మోదీ.. సమాఖ్య స్ఫూర్తికి ఎలా గండికొడుతున్నారో ఉదాహరణలతో చెప్పి మరీ… వాకౌట్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రశాంతంగా… ప్రధాని ప్రసంగాన్ని విని.. తాను ప్రసంగించి వచ్చే అవకాశం లేదు. గౌరవంగా నిరసన వ్యక్తం చేసి.. కేంద్రం పరువు తీయాలనే ఉద్దేశంలో ఉన్నారు. దీని కోసం ఆయన వాకౌట్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూస్తే.. ప్రధాని ప్రసంగం తర్వాత మొదటి చాన్స్ చంద్రబాబుకే వస్తుంది. అప్పుడే ఆయన .. ఏపీ పట్ల కేంద్రం వ్యవహరించిన తీరును వివరించి వాకౌట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

మోదీ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మోదీ అంటే రగిలిపోతున్న మమతా బెనర్జీ, పినరయి విజయన్, కేజ్రీవాల్ తో పాటు.. కర్ణాటక కొత్త సీఎం కుమారస్వామితో కూడా… నీతిఆయోగ్ భేటీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. టీమిండియా పేరుతో.. కబుర్లు చెప్పిన మోదీ.. తీరా అధికారం దక్కిన తర్వాత… టీమ్ మెంబర్స్ అయిన రాష్ట్రాలను ఏ విధంగా బలహీనం చేస్తున్నారో ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేయాలని మాత్రం ముఖ్యమంత్రులు డిసైడయ్యారు.

ఈ విషయంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరపున కూడా పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలందరితో.. విభజన హామీలు అమలు చేయాల్సిన వివిధ శాఖల కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని భావిస్తున్నారు. తనతో పాటు ఎంపీలందర్నీ ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఓ వైపు నీతిఆయోగ్ ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతూంటే.. మరో వైపు ఎంపీలతో ధర్నాలు చేయించే అవకాశం ఉంది. మొత్తానికి చంద్రబాబు… మోదీ ఊహించని… షాక్ నీతిఆయోగ్ సమావేశంలో ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారన్నది మాత్రం నిజమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close