రాముడ్ని ఇప్పుడు రావణుడంటున్నారు.. !

రాముడంటే… సాధారణ ప్రజలకు దేవుడు. కానీ భారతీయ జనతా పార్టీ నేతలకు మాత్రం దేవుడుని మించిన దేవుడు. ఎందుకంటే… ఆ పార్టీని నిలబెట్టింది రాముడే మరి. అయోధ్యలోని రాముడి గుడి వివాదాన్ని ఆ పార్టీ.. దేశవ్యాప్తంగా బలంగా ఎదుగడానికి ఉపయోగించుకుంది. రథయాత్రల పేరుతో.. అద్వానీ… విద్వేషాలు రెచ్చగొట్టో… హిందువులను ఏకం చేశో.. పార్టీని మాత్రం నిలబెట్టగలిగారు. అందుకే అయోధ్య పేరు వినిపిస్తే బీజేపీ నేతల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రతి ఎన్నికలోనూ.. వీరికి రాముడే ముడి ప్రచార సరుకు. అయోధ్యలోని రామాలయమే.. మ్యానిఫెస్టో. గత ఎన్నికల్లోనూ.. బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తే.. రామాలయం కట్టేస్తామని పెద్ద.. పెద్ద ప్రకటనలు చేశారు. వారికి పూర్తి మెజార్టీ కాదు.. అంతకంటే.. నియంతృత్వం చేసుకోగలిగినంత మెజార్టీ వచ్చింది. కానీ గుడి విషయంలో మాత్రం బీజేపీ ముందడుగు వేయలేదు. ముందు ముందు ఈ విషయాన్ని మరింతగా రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉందనే అంచనాలున్నాయి.

అవసరమైనప్పుడల్లా రాజకీయంగా ఉపయోగపడుతున్నాడన్న … అలుసుతోనేమో కానీ.. బీజేపీ నేతలకు, బీజేపీ పాలిత ప్రభుత్వాలకు .. రాముడు అలుసైపోయాడు. గుజరాత్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కూళ్లలో పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాల్లో సీతను రాముడు అపహరించాడని రాసుకొచ్చారు. దీన్నే పిల్లలకు బోధిస్తున్నారు. బొమ్ములు వేసి మరీ.. రాముడ్ని .. రావణాసురుడిలా మార్చి చూపించడంతో దుమారం రేగింది. అచ్చుతప్పనో..మరొకటోనే తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా… ఈ విషయంలో బీజేపీ నేతలు కచ్చితంగా నిందలకు అర్హులే. గుజరాత్‌లో సాధారణంగానే హిందూ వాదాన్ని పిల్లల మనసుల్లో నాటేలా పాఠ్యాంశాలు.. ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటిల్లోనూ రాముడిని.. రావణాసుడిగా చూపించడం.. అది స్కూళ్లకు పంపిణీ చేసే టెక్ట్స్ బుక్‌ల్లోకి వెళ్లిపోవడం చిన్న తప్పిదం కాదు.
అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మహేష్ శర్మ.. మరింత విచిత్రమైన వ్యాఖ్యలు చేసి.. రాముడు,సీతలను సైతం అవమానించే ప్రయత్నం చేశారు. లక్నోలో జర్నలిస్టులకు సంబంధించిన ఓ సమావేశంలో.. అవసరం లేకపోయినా.. సీత ప్రస్తావన తెచ్చారు. సీతమ్మ టెస్ట్‌ ట్యూబ్ బేబీ అని తేల్చి పారేశారు. కుండ నుంచి సీతమ్మ పుట్టిందని చెప్పుకొచ్చారు. ఇలా పురాణాలకు… సరికొత్త సైన్స్‌కు లింక్‌ పెట్టి.. తమ భావజాలాన్ని బయటపెట్టుకోడానికి రాముడు, సీత సహా ఎవరూ అతీతులు కారని నిరూపించారు.

బీజేపీ హిందూ ధర్మాన్ని, దేవుళ్లను రాజకీయానికి వాడుకుంటుంది కానీ.. వారి పవిత్రతను కాపాడే ప్రయత్నం చేయదన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే వినిపిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం విషయాన్ని ఇలానే రచ్చ చేయడం దీనికి నిదర్శనం అంటున్నారు. రాముడు, సీతలపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కూడా.. దీనికి బలం చేకూరుస్తోందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close