రైనా, రాయుడు లేకపోతే ధోనీ కూడా నిస్సహాయుడేనా..!?

ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలసి రావడం లేదు. టోర్నీ ప్రారంభం కాక ముందే సురేష్ రైనా ఇంటికెళ్లిపోయాడు. రైనా లేకపోయినా రైజింగ్ అవుతామని తొలి మ్యాచ్‌లో రాయుడు ధాటిగా ఆడి నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే..ఆ మ్యాచ్‌లో రాయుడు గాయపడ్డాడు. దాంతో రైనా – రాయుడు ఇద్దరూ లేకపోవడం.. ధోనీ ఆడతాడో లేదో అన్నట్లుగా పరిస్థితి మారడంతో చెన్నై ఫేట్ ఒక్కసారిగా మరిపోయింది. ఢిల్లీతో మ్యాచ్‌లో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది చెన్నై.

అంతకుముందు మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలోనూ ఓడిపోయింది. తమ ఓటములకు బ్యాటింగ్ ఆర్డర్ లైనప్ దెబ్బతినడం కారణమని ధోనీ విశ్లేషిస్తున్నారు. అందుకే ఇప్పుడు అందరూ సురేష్ రైనా మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. కానీ చెన్నై టీం మాత్రం..రైనా విషయంలో ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు. రాయుడు తిరిగి వస్తాడని.. రాయుడు లేకపోవడంతోనే జట్టు సమతూకం దెబ్బతింటోందని దోనీ చెబుతున్నాడు. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో మేం బరిలోకి దిగాల్సి ఉందని ధోనీ చెబుతున్నాడు.

ప్రస్తుతానికి ధోనీ కూడా ఫామ్‌లో లేడు. భారం అంతా డూప్లెసిస్ మీదనే ఉంది. అంత ఒత్తిడి పెట్టుకుని డూప్లెసిస్ కూడా అంతంతమాత్రంగానే ఆడుతున్నారు. కనీసం డూప్లెసిస్‌కు మద్దతుగా ఉండే బ్యాట్స్‌మెన్ కూడా కరవయ్యాడు. ఒక వేళ రాయుడు గాయం నుంచి కోలుకున్నా.. అ్పపటికి జట్ట ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ఓటములు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. రైనా ఎందుకు స్వదేశానికి వెళ్లాడని చెప్పాడో.. ఆ కారణం అయిపోయింది. బంధువుల్ని హత్య చేసిన వారిని పోలీసులుపట్టుకున్నారు కూడా. మరి ఇక నైనా జట్టు అవసరాల కోసం సురేష్ రైనా టీమ్‌లో చేరుతాడో లేదో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close