ఇంతకీ సుజనా పై కేసు నమోదయిందా .. లేదా..?

రూ. 5,700 కోట్లు బ్యాంకులకు ఎగవేశారని.. సుజనా చౌదరిపై ఈడీ స్పష్టమైన పేపర్ ప్రకటన విడుదల చేసింది. దీనికి గాను..ఆరు కార్లు సీజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అంటే.. రూ. 5,700 కోట్లు ఎగవేస్తే.. సీబీఐ, ఈడీ, ఐటీ… తీసుకునే చర్యలు ఇవేనా..?. నిరవ్ మోడీ.. రూ. పదమూడు వేల కోట్లు బ్యాంకుల సొమ్ము దోచుకున్నారు. విజయ్ మాల్యా ఖాతాలో ఆరు వేలకోట్ల వరకూ ఉన్నాయి. ఇంకా కొఠారి అని.. మరొకరు అని.. వేల కోట్లలో ఉన్నవారు ఉన్నారు. కానీ.. అలాంటి వారందరిపై…కేసులు నమోదయ్యాయి. దొరికిన వారిని పట్టుకున్నారు. ముందుగా పంపించాల్సిన వాళ్లని పంపించేశారు. మరి..అంతే స్థాయిలో ఫ్రాడ్ చేసినట్లుగా.. ఆరోపిస్తున్న సుజనా చౌదరిపై.. ఇంత వరకూ.. ఫలానా కేసు ఉందని… ఆయనపై ఈ చర్యలు తీసుకుంటున్నామని.. ఎందుకు చెప్పడం లేదు..?

దేశంలో ఇప్పుడు బ్యాంకుల్ని ముంచుతున్న ఆర్థిక నేరగాళ్ల పట్ల ప్రజల్లో అసహనం ఉంది. ఈ కారణంగా… ఎట్టి పరిస్థితుల్లోనూ.. బ్యాంకుల్ని మోసం చేసిన వాళ్లను పదిలి పెడితే… ప్రజలు సహరించరు. ఉన్న పళంగా.. వాళ్లని అరెస్ట్ చేసి.. వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేయాలన్న డిమాండ్లు తరచూ వినిపిస్తూ ఉంటాయి. మరి స్పష్టంగా రూ. 5,700 కోట్లు బ్యాంకులకు ఎగవేసినట్లు… సుజనాపై ఈడీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఉంటే.. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. పైగా సుజనా చౌదరి… ఈడీనే తప్పు చేసిందని.. మండి పడుతున్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బినామీలంటూ.. ఈడీ అధికారులు సీజన్ చేసిన కార్లు.. తన కుటుంబసభ్యుల పేర్ల మీద ఉన్నాయని .. సోషల్ మీడియాలో ఆధారాలు బయటపెట్టారు. వీటికి ఈడీ సమాధానం ఏమిటి..?

ఈడీ కక్ష పూరితంగా తన పై దుష్ప్రచారం చేస్తోందని సుజనా నేరుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకున్న ఈడీ సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం ఏముంది..? సుజనా తప్పు చేస్తే.. ఆధారాలు ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా… వేల కోట్లు ఫ్రాడ్ చేశారని.. మీడియాకు రిలీజ్ చేసి.. ఆనక.. నాలిక కరుచుకుంటే ప్రయోజనం ఏముంటుంది..? సుజనా చౌదరి కంపెనీలపై.. చాలా ఏళ్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏవీ నిజం కాదని.. అవకతవకలు ఉంటే నిరూపించాలని.. ఆయనే సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈడీకీ అవే సవాల్ చేశారు. ఇప్పటికైనా.. సుజనా రూ. 5,700 కోట్లు ఏఏ బ్యాంకులకు ఎగ్గొట్టారో అధికారికంగా ప్రకటించి చర్యలు తీసుకోకపోతే.. కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని.. ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close