సుప్రీంకోర్టు చెప్పినా ఏపీ సర్కార్‌ది ధిక్కరణేనా..!?

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం ఎవరి మాటా వినాలనుకోవడం లేదు. హైకోర్టుపై నమ్మకం ఉందని.. ఏం చెప్పినా పాటిస్తామని మాటిచ్చి కూడా.. హైకోర్టు తీర్పును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వస్తే… న్యాయవ్యవస్థను మళ్లీ పొగిడేసి…నిమ్మగడ్డ పదవి కాలం పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక వేళ సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేక తీర్పు వస్తే… అప్పుడైనా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందా..? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోవిడ్ ప్రారంభమైన తర్వాత కనీసం అరడజను రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి. అన్నింటిలోనూ సుప్రీంకోర్టు ఒకే రకమైన తీర్పు చెప్పింది. స్థానిక ఎన్నికలు జరగాల్సిందేనని తేల్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు వద్దని పిటిషన్ వేసింది.

న్యాయనిపుణులు… లా వ్యవహారాలపై కనీస అవగాహన ఉన్న వారు కూడా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నారు. సీఈసీకి ఉన్నన్ని అధికారాలు… ఎస్‌ఈసీకి కూడా ఉంటాయని పలుమార్లు కోర్టులు కూడా తీర్పులు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రకారం… సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఊరట దక్కే చాన్స్ స్వల్పమే. ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సోమవారం ఉదయం పది గంటలకు అన్ని జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేసి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభించాలి. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ పదకొండు గంటల తర్వాత విచారణకు వస్తుంది. అంటే నోటిఫికేషన్లు జారీ చేయకపోతే.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లుగానే తేలిపోతుంది.

సుప్రీంకోర్టు ఎస్‌ఈసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినా… ప్రభుత్వం పాటించడానికి సిద్ధమవుతుందా అన్నది మరో ప్రశ్న. ఎదుకంటే.. ఎన్నికలు నిర్వహించకూడదన్నదే జగన్ పట్టుదల. సీఎం తానా.. రమేష్ కుమారా అన్నది జగన్ ఒకటే మాట. తాను చెప్పినట్లే జరగాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక వేళ సుప్రీంకోర్టు చెప్పినా ఎన్నికల నిర్వహణకు సహకరించకపోతే.. స్వతంత్ర భారత చరిత్రలో జగన్ సరికొత్త అధ్యాయం లిఖించినట్లే. ఏం జరుగుతుందో.. రాజ్యాంగం బలం ఏమిటో తెలిపోయే సందర్భం వచ్చే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close