అంతర్జాతీయ వ్యవహారాల్లో సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అమెరికా.. వెనిజులా అధ్యక్షుడ్ని అపహరించినా ..కొలంబియాలో డ్రగ్ లార్డ్ ఎల్ మాంచోను హతమార్చినా .. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినా అంతా సుదీర్ఘమైన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసమే. ఇప్పుడు భారత్ కూడా అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చిందన్న భావన వినిపిస్తోది. పాకిస్తాన్ ను సర్వనాశనం చేసేసి.. మళ్లీ కోలుకోకుండాచేసి మన వైపు కన్నెత్తకుండా చూడాలన్న అబిప్రాయం వినిపిస్తోంది. ఈ అంశంపై భారత్ కూడా ఆలోచన చేస్తోందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది.
మారుతున్న భారత వ్యూహశైలి
గతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిగినప్పుడు భారత్ కేవలం దౌత్యపరమైన నిరసనలకు పరిమితమయ్యేది. కానీ, సర్జికల్ స్ట్రైక్స్ , బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత భారత్ శైలి పూర్తిగా మారింది. శత్రువు ఇంటికి వెళ్లి మరీ కొడతాం ” అనే స్పష్టమైన సందేశాన్ని భారత్ పంపింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా కుప్పకూలి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, భారత్ తన సైనిక శక్తిని ఉపయోగించి ఆ దేశపు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను శాశ్వతంగా తుడిచిపెట్టే అవకాశం ఉందనే భయం ఇస్లామాబాద్‌ను వెంటాడుతోంది.
పాక్ ఆందోళన – జర్దారీ వ్యాఖ్యల వెనుక పరమార్థం
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఇటీవల అర్థవంతమైన చర్చల గురించి మాట్లాడుతుండటం వారి బలహీనతకు నిదర్శనంగా కనిపిస్తోంది. భారత్ అఖండమైన సైనిక ఆధునీకరణ, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన చూస్తుంటే, ఏదో ఒక పెద్ద ఆపరేషన్ ఖాయమని పాక్ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే, భారత్ దృష్టిలో అర్థవంతమైన చర్చలు అంటే ఉగ్రవాదం లేని వాతావరణం మాత్రమే. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోనంత కాలం, చర్చల కంటే నిర్ణయాత్మక సైనిక చర్యే శాశ్వత పరిష్కారం అనే భావన భారత ప్రజల్లోనూ బలంగా నాటుకుపోయింది.
శాశ్వత పరిష్కారం దిశగా భారత్ అడుగులు
అమెరికా పనామాలో మన్యుయెల్ నోరియెగాను పట్టుకున్నా, లేదా కొలంబియాలో డ్రగ్ మాఫియాను అంతం చేసినా.. అది ఆ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి కోసం తీసుకున్న కఠిన నిర్ణయం. భారత్ కూడా పాకిస్తాన్ విషయంలో కేవలం సరిహద్దు కాపలాకు పరిమితం కాకుండా, ఆ దేశం మళ్లీ కోలుకోలేని విధంగా దాని ఉగ్రవాద యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడమే అర్థవంతమైన పరిష్కారం అవుతుంది. పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులు ఇప్పుడు అంతర్జాతీయంగా పసలేనివిగా మారుతున్నాయి, ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయిన దేశం యుద్ధాన్ని భరించలేదని ప్రపంచానికి తెలుసు.
బలమైన భారత్, కఠిన నిర్ణయాలు
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. భారత్ తన పొరుగున ఉన్న ముప్పును శాశ్వతంగా తొలగించుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని రక్షణ నిపుణులు సలహాలిస్తున్నారు. ఒకవేళ భారత్ నిజంగానే ఆ దిశగా అడుగులు వేస్తే, అది కేవలం భూభాగం కోసం కాకుండా, దక్షిణాసియాలో శాశ్వత శాంతి స్థాపన కోసమే అవుతుంది. జర్దారీ కోరుకుంటున్న చర్చలు కాకుండా, భారత్ విధించే నిబంధనలే భవిష్యత్తును శాసిస్తాయి.


