ట్రంప్‌తో విందుకు జగన్‌కు ఆహ్వానం రాకపోవడం నేరమా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందు భేటీకి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం రాలేదు. దీన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయ విమర్శలకు వాడుకుంటోంది. ఆయనపై కేసులున్నాయని… ఆయన అవినీతి పరుడని.. అగ్రరాజ్యానికి తెలుసని.. అలాంటి వ్యక్తిని రానివ్వరని.. విమర్శిస్తోంది. అంతే కాదు.. అది ఏపీకి జరిగిన అవమానమని కూడా తేల్చేస్తోంది. విమర్శించాలి కాబట్టి.. ప్రతీ దాన్ని… జగన్మోహన్ రెడ్డి కేసులకు.. సీబీఐ విచారణకు లింక్ పెట్టి.. టీడీపీ విమర్శించేస్తోందన్న అభిప్రాయం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.

దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి.అందులో పిలించింది ఎనిమిది మంది ముఖ్యమంత్రుల్ని మాత్రమే. మిగతా 21 మంది ముఖ్యమంత్రుల్ని.. ఎందుకు పిలవలేదు..? ఈ లాజిక్‌ను తెలుగుదేశం పార్టీ మిస్సయింది. ఆర్థికనేరగాడనే.. జగన్మోహన్ రెడ్డిని.. ఆహ్వానించలేదని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబు లెక్క ప్రకారం.. మిగతా 20 మంది ముఖ్యమంత్రులకు కూడా అదే మైనస్ పాయింట్ అయి ఉండాలి. కానీ.. అలా.. ముఖ్యమంత్రులపై కేసులు లేవు. అయినా వారికి ఆహ్వానం లేదు. పలు కీలక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందలేదు.

విందుకు ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించడంలో.. అటు అమెరికా అధికారులు..ఇటు రాష్ట్రపతి భవన్ కొన్ని ప్రాతిపదికల్ని పెట్టుకుంది. అందులో సీబీఐ కేసులుఉన్న వాళ్లను పిలువకూడదనే నిబంధన లేదు. ముఖ్యమంత్రుల దగ్గరకు వచ్చే సరికి ఉండదు కూడా. ఆయనపై సీబీఐ కేసులు ఉన్నాయా లేదా అన్నది టాపిక్ కాదు.. ఉన్నా… లేకపోయినా… ఆయనకు ముఖ్యమంత్రి హోదా ఉంటుంది. అదే ఫస్ట్.. ఆ తర్వాతే మిగతావి. జగన్మోహన్ రెడ్డి కి ఆహ్వానం రాకపోవడానికి కేసులు కారణం కాదు. ఏపీకి అవమానం కూడా కాదు. కానీ జగన్ వల్ల ఏపీకి అన్యాయం జరిగిపోయిందని.. టీడీపీ మాత్రం ప్రచారం చేసేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close