జగన్ సమస్య ప్రైవేటు ఆస్పత్రులా..? టీకాలా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి టీకాల కోసం ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ ఇప్పుడు.. చర్చనీయాంశమవుతోంది. అందులో ప్రజల టీకాల కోసం జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చింది తక్కువ.. కానీ పూర్తిగా ప్రైవేటు ఆస్పత్రుల మీద దృష్టి కేంద్రీకరించారు. వాటికి సప్లయ్ నిలిపివేయాలని కోరారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటు ఆస్పత్రుల మీద ఎందుకు అంత కోపం అన్న సందేహం చాలా మందిలో బయలుదేరింది. ఆ లేఖలోనూ ప్రైవేటు ఆస్పత్రుల మీద తప్పుడు ఆరోపణలు చేశారు సీఎం జగన్. ఒక్కో డోస్‌కు ఆస్పత్రులు రూ. రెండు వేల నుంచి పాతిక వేల వరకూ వసూలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. నిజానికి ఒక్కో డోస్ రూ.1250కే కార్పొరేట్ ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకు వచ్చాయి.

భారీ కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్లు ఆర్డర్ పెట్టుకుంటున్నాయి. చిన్న, మధ్య స్థాయి ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం లేదు. గతంలో ప్రభుత్వాలే.. తమకు వచ్చిన కోటాను.. ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చేవి. ఇప్పుడు.. కేంద్రమే.. వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది.దీంతో ప్రభుత్వం సరఫరా నిలిపివేసింది. వ్యాక్సిన్ కంపెనీలు.. తమ రేట్లను ప్రకటించాయి. ఆ రేట్ల ప్రకారం.. ప్రైవేటు ఆస్పత్రులు టీకాలు వేస్తున్నాయి. డబ్బున్నవారికి.. వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాల్సిన పని లేదని.. వారు కొనుగోలు చేసుకుంటారన్న ఉద్దేశంతోనే … టీకా తయారీ కంపెనీలు చేసే ఉత్పత్తిలో ఐదు శాతం ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవచ్చని రిలీఫ్ ఇచ్చారు. డబ్బున్నవారే టీకాలు వేయించుకుంటున్నారు. ఇదీ కూడా వద్దని జగన్ అంటున్నారు.

ప్రైవేటు ఆస్పత్రులపై కోపంతో జగన్ ఆ లేఖ రాశారని అందరికీ ఓ రకమైన అభిప్రాయం కలుగుతోంది. ప్రజలకు టీకాలు వేయడానికి అవసరమైన మొత్తం వయల్స్ పంపాలని సీఎంగా కోరడంలో తప్పు లేదని కానీ.. ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా నిలిపివేసి.. అక్కడ టీకాలు వేయవద్దని చెప్పడం ఏమిటన్న సందేహం చాలామందిలో వస్తోంది. ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు విరుచుకుపడుతున్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయకపోతే.. ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఆరోగ్యస్రీకి చెల్లించాల్సిన నిధులు చెల్లించడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రైవేటు ఆస్పత్రులపై వ్యతిరేకతే .,. వ్యాక్సిన్లు ఇవ్వొద్దనడానికి లేఖ రాయడానికి కారణం అయిందా అన్న చర్చ జరుగుతోంది.

జగన్మోహన్ రెడ్డి… ఏపీకి టీకాల కోసం లేఖలు రాసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ప్రభుత్వం.. వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు పెట్టుకోవాలని కేంద్రం చెప్పేసింది. ఈ క్రమంలో తమకు ఇన్ని వ్యాక్సిన్లు కావాలని అడగడం లేదు కానీ… మరో రకమైన డిమాండ్లతో జగన్ .. ఢిల్లీకి లేఖలు రాయడం.. అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close