దాడి ఘటనతో పొలిటికల్ మైలేజీ రాలేదని జగన్ ఫీలవుతున్నారా..?

వైఎస్ జగన్ పాదాయాత్ర కొనసాగింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను మరోసారి వాయిదా వేశారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఇంకా విశ్రాంతి అవసరమని చెప్పారని.. ఆ మేరకు పాదయాత్ర వాయిదా వేసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జగన్ గాయం విషయంలోనో చాలా పెద్ద సెటైర్లు పడ్డాయి. అలాంటి… పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నా.. ఇంకా.. గాయం తగ్గలేదన్న కారణం చూపి.. పాదయాత్రకు డుమ్మకొట్టడం ఏమిటో.. సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు.

పదే పదే వాయిదా వేస్తూండటంతో పాదయాత్ర డొలాయమానంలో పడింది. స్వల్ప గాయమే కావడంతో . మరో రెండు రోజుల్లో… పాదయాత్ర ప్రారంభమవుతుదని దాడి జరిగినప్పుడు వైసీపీ నేతలు ప్రకటించారు. ఆ తర్వాత వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభిస్తారని వైసీపీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు డాక్టర్లు ఇంకా విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో పాదయాత్ర మరింత ఆలస్యమవుతోంది. భుజం కదిలించవదద్దని డాక్టర్లు చెప్పారని.. ఇలాంటి పరిస్థితుల్లో పాదయాత్ర వద్దని జగన్ కుటుంబసభ్యులు సలహాలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిన తర్వాత వైద్యం చేసిన డాక్టర్…బ్యాండేజ్ వేసి పంపించారు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ తో తగ్గిపోతుందన్నారు. సాధారణంగా అరసెంటిమీటర్ గాయం అయితే.. చేసే వైద్యమే అది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత నింపాదిగా… విమానంలో హైదరాబాద్ వచ్చి.. అస్పత్రిలో చేరిపోవడమే అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత సెంటిమీటరున్నర గాయం అయిందని.. నరం తెగిందని.. తొమ్మిది కుట్లేశామంటూ.. వైద్యులు ప్రకటించండంపై టీడీపీ నేతలు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతోనే.. దాడి వ్యవహారం పక్కకుపోయింది. రాజకీయం ముందుకొచ్చింది.

మరో వైపు.. వైసీపీ నేతలు..ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలను కలిశారు. వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి.. ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన విధానంగా గురించి వివరించారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం.. వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన వెంటనే రాష్ట్రపతిని కూడా కలిసి.. ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. జగన్ తో సహా హైకోర్టులో మొత్తం మూడు పిటిషన్లు వేశారు. స్వతంత్ర సంస్థ దర్యాప్తును కోరుతున్నారు. వాటిపై విచారణ జరగనుంది.

కులాసాగా నడిచి వెళ్లిన జగన్ కావాలనే సాగదీస్తున్నారనే విమర్శలు సహజంగానే వస్తున్నాయి. రాజకీయ మైలేజ్ తీసుకోవడం ఎలా అనే వ్యూహరచనలో వైసీపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. హత్యాయత్నంగా ఎంత ఫోకస్ చేసినా మైలేజీ రాలేదన్న అసంతృప్తి జగన్ లో ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close