కాంగ్రెసేత‌ర అభిప్రాయాన్ని కేసీఆర్ మార్చుకుంటారా..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిపాదిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ లో కాంగ్రెసేత‌ర‌, భాజ‌పాయేత‌ర పార్టీలు మాత్ర‌మే ఉండాల‌నేది ఆయ‌న ఆలోచ‌న. అలాంటి ప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిలో కేసీఆర్ కొంత స‌త‌మ‌త‌మౌతున్న ప‌రిస్థితి. భాజ‌పా అనుకూలవాదిగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కొన్ని విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. అయితే, రెండు జాతీయ పార్టీలు ప్ర‌మేయం లేని ఫ్రెంట్ మ‌నుగ‌డ‌పై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. గ‌తంలో ఇలా ఏర్ప‌డిన ఫ్రెంట్ లు ఎక్కువకాలం అధికారంలో ఉండ‌లేక‌పోయాయి. కాబ‌ట్టి, ఎన్నిక‌ల త‌రువాత ఏదో ఒక జాతీయ పార్టీ మ‌ద్ద‌తుతోనే కూట‌మి క‌డితేనే మంచిద‌నే అభిప్రాయం కొన్ని ప్ర‌ధాన ప్రాంతీయ పార్టీల్లో ఉంద‌నేది స్ప‌ష్టం. ఈ నేప‌థ్యంలో జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కం అవుదామ‌ని భావిస్తున్న కేసీఆర్… త‌న అభిప్రాయాన్ని కొంత మార్చుకునే అవ‌కాశం ఉందా? ఏదో ఒక జాతీయ పార్టీ మ‌ద్ద‌తుకు ఆయ‌న కూడా ఓకే చెప్తారా అంటే… ఆ దిశ‌గానే కొన్ని ప్ర‌య‌త్నాలు మొద‌లైన‌ట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

గ‌త నెల‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల జ‌రిగిన ప‌దిరోజుల త‌రువాత‌, తెలంగాణ రాష్ట్ర స‌మితికి చెందిన ఒక ప్ర‌ముఖ నాయ‌కుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్ర‌ముఖ నాయ‌కుడితో భేటీ అయిన‌ట్టుగా ఓ జాతీయ ప‌త్రిక పేర్కొంది. కేంద్రంలో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశాల మీదే ఈ ఇద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చి జ‌రిగిన‌ట్టుగా స‌మాచారం. జాతీయ పార్టీ ప్ర‌మేయం లేకుండా ఏర్ప‌డిన ప్ర‌భుత్వాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌లేవ‌నీ, 1996 నాటి యునైటెట్ ఫ్రెంట్ అనుభ‌వాన్ని ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధాన‌మంత్రి రేసులో తాను లేనంటూ చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేయ‌డంతోనే తెరాస వైఖ‌రిలో కొంత మార్పు వ‌చ్చింద‌నేది ఆ క‌థ‌నం సారాంశం.

తెరాస, కాంగ్రెస్ లు తెలంగాణ‌లో అధికార ప్ర‌తిప‌క్షాలుగా ఉన్నాయి. కాబ‌ట్టి, కాంగ్రెస్ కి ఆ పార్టీ మ‌ద్ద‌తు సాధ్య‌మేనా అనే చ‌ర్చ ఉండ‌నే ఉంది. అయితే, ఈ సంద‌ర్భంగా జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించి తెరాస ధోర‌ణిలో కొంత మార్పు వ‌స్తోంద‌నే సంకేతాలు ఈ భేటీ ద్వారా ఇచ్చినట్ట‌యింది. కాంగ్రెస్ ఎంపీతో త‌మ పార్టీ నేత భేటీ జ‌రిగినా, అది కేవ‌లం మ‌ర్యాద ‌పూర్వ‌క‌మైందే త‌ప్ప‌… రాజ‌కీయ అంశాల‌కు చ‌ర్చ‌కు రాలేదంటూ తెరాస నేత‌లు అంటున్నారు. మొత్తానికి, భాజ‌పాయేత‌ర కాంగ్రెసేత‌ర మూల‌సూత్రంలో కొంత మార్పు అవ‌స‌రం అనేది కేసీఆర్ గుర్తించా

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close