కొమ్మినేని తన నోట్లో మాటల్ని… ఎదుటి వాళ్ల మనసుల్లో పెడుతున్నారా..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం ప్రతిపక్షం కాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ.. ఆ పార్టీకి అనుబంధ మీడియా కానీ… ఆంధ్రప్రదేశ్‌కే తాము ప్రతిపక్షం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ అధికారిక నిర్ణయాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. దీన్ని వైసీపీ అనుబంధ మీడియా మరింత మందుకు తీసుకెళ్తోంది. ఈ విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు అనే సీనియర్ జర్నలిస్ట్ తనకు తాను ఈ విషయంలో ప్రత్యేకంగా అత్యంత దిగువస్థాయి ప్రమాణాలను నిర్దేశించుకున్నారు. వాటిని రోజు రోజుకు మరింతగా దిగజార్చుతూ తీసుకుపోతున్నారు. మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్యను కొమ్మినేని ఇంటర్యూ చేసిన తీరు.. దాన్ని పత్రిక ఎడిట్ పేజీలో ప్రచురించిన తీరే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఇంటర్యూకు సాక్షి ఎడిటోరియల్ నిపుణులు పెట్టిన టైటిల్..” రాజధాని కోసం ఇంత వెంపర్లాటా..?”. నిజానికి ఈ మాట పద్మనాభయ్య అనలేదు. ఆయన మరో అర్థంలో అన్నారు. ఆయన వెర్షన్ ఆయన చెప్పారు. కానీ ఏదో వెంపర్లాడిపోతున్నారన్నట్లుగా తన నోట్ల మాటల్ని… పద్మానాభయ్య మనసులో పెట్టేశారు కొమ్మినేది. అదే కాదు.. కచ్చితంగా తను రావాల్సినట్లుగా సమాధానం చెబుతారో… లేకపోతే… ఆయన చెప్పే సమాధానాలను.. తమకు కావాల్సినట్లుగా మార్చుకోవచ్చన్నట్లుగా ఇంటర్యూలు చేస్తున్నారు. పద్మనాభయ్య ఇంటర్యూలోనూ అదే జరిగింది. కానీ కొమ్మినేని కోరుకున్నంత ఘాటుగా.. పద్మనాభయ్య స్పందించలేదు. అందుకే కొమ్మినేని అండ్ సాక్షి ఎడిటోరియల్ .. తమ మనసులో మాటల్నో.. పద్మనాభయ్య నోట్లో పెట్టే ప్రయత్నం చేసినట్లుగా స్పష్టంగా తెలిసిపోతుంది.

బలమైన రాజధాని ఉంటే.. రాష్ట్రం ఆర్థికంగా వేగంగా ఎదుగుతుందన్న ఉద్దేశంతోనే.. చంద్రబాబు అమరావతి రూపకల్పన చేస్తున్నారు. అమరావతి వల్ల సాక్షి పత్రికకు కానీ.. వైసీపీకి కానీ వస్తున్న నష్టం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అదే పనిగా… వ్యతిరేక అభిప్రాయాలు పెంచడానికి శాయక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతారో.. వాళ్లనే తీసుకొచ్చి ఇంటర్యూలు చేస్తున్నారు. వారు చెప్పే వాటిని కూడా వక్రీకరించి ప్రచురిస్తున్నారు. ప్రసారం చేస్తున్నారు. అది నిరంతరాయంగా సాగుతోంది. జర్నలిజంలో.. సాక్షి మార్క్ జర్నలిజం వేరని.. పదే పదే నిరూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com