ఈ రోజు నాగ్ ఏం మాట్లాడతాడో?

మ‌రి కొద్ది సేప‌ట్లో హైద‌ర‌బాద్‌లోని నోవొటెల్‌లో ప్రేమ‌మ్ ఆడియో ఫంక్షన్ జ‌ర‌గ‌బోతోంది. మామూలుగా అయితే ప్రేమ‌మ్ ఆడియో గురించి స్పెష‌ల్ గా ఎదురు చూడ‌క్కర్లెద్దు. కానీ ఈసారి ఈ ఆడియో ఫంక్షన్ వెరీ వెరీ స్పెష‌ల్ కాబోతోంద‌ని విశ్వస‌నీయ వ‌ర్గాల టాక్‌. కొన్ని చిక్కు ముడుల‌కు ఈ వేడుక‌లో స‌మాధానం దొర‌కొచ్చని టాక్‌. గ‌త కొంత‌కాలంగా నాగ‌చైత‌న్య – స‌మంత ప్రేమ వ్యవ‌హారం, పెళ్లి క‌బుర్లపై ర‌క‌ర‌కాల గాసిప్పులు వినిపించాయి. వీటిపై ఇటీవ‌లే నాగార్జున‌, నాగ‌చైత‌న్య కూడా క్లారిటీ ఇచ్చేశారు. అయితే తొలిసారి నాగార్జున అభిమానుల ముందు అఫీషియ‌ల్‌గా నాగ‌చైత‌న్య పెళ్లి గురించి ఓ ప్రక‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్. ఈ కార్యక్రమానికి స‌మంత కూడా వ‌స్తోంద‌ని, ఈ వేదిక‌పై త‌న కొడ‌ల్ని నాగ్ అభిమానుల‌కు ప‌రిచయం చేయ‌బోతున్నాడ‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నాగ్ కూడా ” ఓ మంచి ముహూర్తం చూసుకొని.. చైతూ పెళ్లి మేట‌ర్ నేనే చెబుతా. నా కోడ‌ల్ని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేస్తా” అని గ‌తంలో చెప్పాడు. ఈరోజు (మంగ‌ళ‌వారం) అక్కినేని నాగేశ్వర‌రావు జయంతి. కోడ‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికీ, చైతూ పెళ్లి క‌బురు వినిపించ‌డానికి ఇంత‌కంటే మంచి ముహూర్తం ఏముంటుంది? నిశ్చితార్థానికి సంబంధించిన డేట్ కూడా నాగ్ ఈరోజు ఎనౌన్స్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. అందుకే అంద‌రి క‌ళ్లూ ప్రేమ‌మ్ ఆడియో ఫంక్షన్ వైపు ట‌ర్న్ అయ్యాయి. ప్రేమమ్ ఆడియో ఫంక్షన్ అప్‌డేట్స్ కోసం.. తెలుగు 360 బ్రౌజ్ చేస్తూనే ఉండండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close