నాగబాబు జనసేనకు మేలు చేస్తున్నారా..? కీడా..?

నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పవన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు.. తమ్మడికి ఇతోధిక సాయం చేస్తారనుకుంటే భారంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు.. తిట్లు.. శాపనార్ధాలతో.. ప్రత్యర్థులపై ఆయన నోరు చేసుకుంటున్న విధానం… హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఎక్కడా.. తన లాంగ్వేజ్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం లేదు. అదే జిల్లాలో ఏళ్లతరబడి రాజకీయాలు చేస్తూ.. ప్రజల మధ్యే ఉంటున్న వారిని “వెస్ట్ ఫెలోస్” అంటూ.. దారుణమైన పదాలు వాడుతున్నారు. తూ.గో జిల్లాలో పుట్టి… చెన్నై, హైదరాబాద్‌లలో పెరిగి… తానే నిజమైన లోకల్ అని.. చెప్పుకోవడానికి.. అక్కడే పుట్టిపెరిగి.. అక్కడే రాజకీయం చేస్తున్న వారిని దారుణంగా తిట్టిపోస్తున్న వైనం కలకలం రేపుతోంది. చివరికి లోకల్ సిటీ కేబుల్ చానళ్లకు ఇచ్చే ఇంటర్యూల్లోనూ… చాలా దారుమమైన యాటిట్యూడ్ చూపిస్తూ.. అందరూ పనికి మాలిన సన్నాసులు. తాను.. తన తమ్ముడు మాత్రమే మహానుభావవులమని.. చెప్పుకుంటున్నారు.

పవన్, నాగబాబు.. మహానుభావులని చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ.. దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్న వారిని అలా తిట్టిపోయడం ఏమిటన్న అంశం తెరపైకి వస్తోంది. కేవలం.. కులం కోణంలోనే.. నాగబాబు ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. తన సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి.. తన పార్టీకి ఏకపక్ష మద్దతు.. పొందడానికే ఇలా చేస్తున్నారంటున్నారు. ముఖ్యంగా.. నర్సాపురంలో ప్రత్యర్థులుగా ఉన్న క్షత్రియ సామాజికవర్గ అభ్యర్థులపై… కులం కోణంలో విమర్శలు చేయడం కలకలం రేపుతోంది.

రాజకీయ పార్టీ అన్న తర్వాత… అన్ని వర్గాల మద్దతుపొందితేనే విజయం సాధిస్తారు. తన వర్గాన్ని రెచ్చగొట్టి.. ఇతరులపై ఉసిగొల్పడం ద్వారా… విజయం సాధించడం అసాధ్యం. తన సామాజికవర్గం మెజార్టీ ఉన్నప్పటీకీ… ఆ ఒక్కచోటే అది ఉపకరిస్తుంది. రాష్ట్రం మొత్తం తేడా కొడుతుంది. ఆ విషయం నాగబాబు అర్థం చేసుకోవడం లేదు. తన తమ్ముడి కష్టాన్ని గుర్తించకుండా.. తాను..తన ఓట్లు అన్నట్లుగా ఆయన జగడం పెట్టుకుంటున్నారు. సాధారణంగానే… గోదావరి జిల్లాలో కాపు వర్సెస్ క్షత్రియ అన్న వాతావరణం ఉంటుంది. పలుమార్లు భీమవరంలోనే.. పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ గొడవపడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు …నాగబాబు దీన్ని మరింత రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది.. జనసేనకు … ఇబ‌్బందికరంగా మారింది. నాగబాబు… తెలిసి కూడా.. జనసేనకు సమస్యలు సృష్టిస్తున్నారన్న అభిప్రాయం.. జన సైనికుల్లో ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close