మోహ‌న్‌లాల్ సినిమాలో నాగార్జున‌?

మోహ‌న్ లాల్ – ప్రియ‌ద‌ర్శన్ కాంబినేష‌న్లో రూపొందిన మ‌ల‌యాళ‌ క్రైమ్ థ్రిల్లర్ ‘ఒప్పమ్’. మూడు వారాల్లోనే 27 కోట్లు వ‌సూలు చేసి… అక్కడ సూప‌ర్ హిట్ చిత్రాల జాబితాలో అగ్ర స్థానంలో కూర్చొంది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుద‌ల అవుతోంది. ఓవ‌ర్ సీస్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ తెలుగు హ‌క్కుల్ని కైవ‌సం చేసుకొంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాల‌న్నది ఈ సంస్థ ఆలోచ‌న‌. మోహ‌న్‌లాల్ పాత్రకు నాగార్జున అయితే బాగుంటాడ‌ని నిర్మాత‌లు భావిస్తున్నార్ట. త్వర‌లోనే నాగ్‌ని క‌లసి ఈ సినిమా చూపించాల‌ని, నాగ్ అంగీకారం తీసుకోవాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఇంత‌కీ ఒప్పమ్ క‌థ ఏమిటంటే….మోహ‌న్ లాల్ ఈ సినిమాలో అంధుడు. ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో ఓ హ‌త్య జ‌రుగుతుంది. కిల్లర్ త‌ప్పించుకుంటాడు. ఆ హంత‌కుడిని మోహ‌న్‌లాల్ ఎలా ప‌ట్టుకొన్నాడ‌న్నది క‌థాంశం.

గుడ్డివాడి పాత్ర చేయ‌డానికి తెలుగు హీరోలు సిద్దంగా ఉండ‌రు. అయితే.. ప్రయోగాత్మక చిత్రాలు చేయ‌డానికి ముందు నుంచీ ఉత్సాహం చూపించే ఏకైక క‌థానాయ‌కుడు నాగార్జున‌. ఇటీవ‌ల ఊపిరి కోసం సినిమా మొత్తం వీల్ ఛైర్‌కే ప‌రిమిత‌మ‌య్యే పాత్రలో క‌నిపించాడు. ఆ ధైర్యంతోనే ఒప్పమ్ నిర్మాత‌లు నాగ్‌ని సంప్రదించాల‌ని భావిస్తున్నార్ట. ఒక‌వేళ నాగ్ నో అంటే అప్పుడు ఒప్పమ్‌ని తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌న్నది నిర్మాతల ఆలోచన . మ‌న‌మంతా, జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో మోహ‌న్‌లాల్‌కి తెలుగులో ఇమేజ్ పెర‌గ‌డంతో డ‌బ్బింగ్ ఆప్షన్ కూడా బాగానే ఉంటుంద‌ని అనుకుంటున్నారు. సో.. ఒప్పమ్ రీమేకా, డ‌బ్బింగా అనేది నాగ్ నిర్ణయంపై ఆధార‌ప‌డి ఉంద‌న్నమాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close