భాజ‌పాతో విడాకుల‌కు నితీష్ సిద్ధ‌ప‌డుతున్నారా..?

మ‌రో అధికార పార్టీ భాజ‌పాతో బంధం తెంచుకునేందుకు సిద్ధ‌మౌతోంది..! మ‌రో ముఖ్య‌మంత్రి కూడా మోడీ పెత్త‌నాన్ని భ‌రించ‌లేక‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు క‌నిపిస్తోంది. బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ కూడా ఎన్డీయేకి విడాకులు ఇచ్చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నార‌నే చెప్పొచ్చు. గ‌డ‌చిన రెండు వారాల్లో ఆయ‌న మాట తీరులో గ‌ణ‌నీయంగా వ‌స్తున్న అనూహ్య‌ మార్పే అందుకు సాక్ష్యం. మిత్ర‌ప‌క్ష‌మైన భాజ‌పా తీరును సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. మోడీకి ఎదురెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మోడీ ప్ర‌భుత్వం తీసుకుని రాబోతున్న సిటిజెన్ షిప్‌ బిల్లును వ్య‌తిరేకిస్తూ మే 17న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియ‌న్ నితీష్ ను క‌లిశారు. ఇది భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టే అంశం అంటూ నితీష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ బిల్లు పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు వ‌స్తే వ్య‌తిరేకంగా ఓటు వేసేందుకు జేడీయూ సిద్ధంగా ఉన్న‌ట్టు నితీష్ హామీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం! ఇక‌, మే 26న ఓ కార్య‌క్ర‌మంలో నితీష్ మాట్లాడుతూ… నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. మోడీ స‌ర్కారు తీసుకొచ్చిన పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తానూ స‌మ‌ర్థించాన‌నీ, కానీ ఎంత‌మందికి ఇది ఉప‌యోగ‌ప‌డింద‌ని ప్ర‌శ్నించారు..? బ‌డాబాబులు ఒక చోటి నుంచి మ‌రో చోటిని డ‌బ్బు ర‌వాణా చేసుకున్నారని, పాత నోట్ల‌కు కొత్త‌గా మార్చుకున్నార‌నీ, పేద‌లు మాత్ర‌మే ఇబ్బందులు ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు.

ఇలా మాట్లాడిన మ‌ర్నాడే… అంటే, మే 27న నితీష్ కి కేంద్రం చిన్న ఝ‌ల‌క్ ఇచ్చింది. తుఫాను బాధితుల స‌హాయం కోసం కేంద్రం ఇస్తామ‌ని ప్రామిస్ చేసిన రూ. 1750 కోట్ల‌లో.. ఓ రూ. 500 కోట్ల‌కు కేంద్రం క‌త్తెర వేసింది! 2017లో బీహార్ లోని 19 జిల్లాలు తీవ్ర తుఫానుకి గుర‌య్యాయి. దీంతో కేంద్ర సాయంగా రూ. 1250 కోట్లు ఇస్తామ‌న్నారు. దీనికి అద‌నంగా మ‌రో రూ. 500 కోట్లు ఇస్తామ‌ని మోడీ ప్ర‌క‌టించారు. ఇప్పుడా మాట వెన‌క్కి తీసుకుని… రూ. 500 కోట్లు క‌ట్ చేశారు! దీంతో నితీష్ మ‌రింత అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఆవేద‌న‌లోంచి, మే 29న బీహార్ కి ప్ర‌త్యేక హోదా కావాలంటూ డిమాండ్ తెర మీదికి తెచ్చారు. నిజానికి, ఎన్డీయేతో దోస్తీ కుదిరాక దీని గురించి నితీష్ మాట్లాడ‌టం మానేశారు. కానీ, ఇప్పుడు మ‌ళ్లీ ఇదే అంశాన్ని తెర మీదికి తెచ్చి.. వెన‌కబ‌డిన రాష్ట్రాల‌కు హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

గ‌డ‌చిన రెండు వారాలుగా నితీష్ వ్య‌వ‌హారం ఇలా మారుతూ వ‌స్తోంది. మిత్ర‌ప‌క్షం స్థాయి దాటి, ఒక ప్ర‌తిప‌క్షంగా భాజ‌పాని నిలదీయ‌డం, మోడీ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం, కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వీటి అంతిమ ల‌క్ష్యం తెగ‌తెంపులే అన్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. లోక్ స‌భ ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి ప్ర‌తిప‌క్షాల‌న్నీ కూట‌మిగా ఏర్ప‌డే వాతావ‌ర‌ణం క‌నిపిస్తున్న ఈ త‌రుణంలో… త‌న వాయిస్ పెంచ‌డం ద్వారా, ఎన్డీయేకి దూరంగా జ‌రుగుతూ భ‌విష్య‌త్తు రాజ‌కీయాల కోసం త‌లుపులు తెరిచి పెట్టుకుంటున్నారేమో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close