ఛానల్ వ్యాపారం లో స్వామీజీ విజయం సాధించగలరా ?

పూజ్యశ్రీ పరిపూర్ణానంద నిర్వహిస్తున్న భారత్ టుడే టీవీ పరిస్థితి అయోమయంగా కన్పిస్తోంది. ఎలాంటి ముందు చూపు లేకుండా పెట్టిన చానెల్ ఇప్పుడు నానా కష్టాలు పడుతోంది. చానెల్ నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని వారికి పెద్ద పదవులు ఇచ్చిన పరిపూర్ణ… చానెల్ కు ఇప్పుడు రెవిన్యూ ఎలా తీసుకురావాలో అర్థం కాని పరిస్థితిలోకి వచ్చారు. చానెల్ కు ఖర్చు కోటి అవుతుంటే వస్తుందో మాత్రం పదీ పరకే అన్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ రాందేవ్ బాబా కలలు కంటున్న పరిపూర్ణానంద స్వామికి అనుభవరాహిత్యమే చానెల్ కు ఇప్పుడు శాపంలా మారిందంటున్నారు ఆయన సన్నిహితులు. చానెల్ ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నవారు పేర్లు కూడా మీడియా వర్గాలకు ఎవరికీ పెద్దగా తెలియవు. వారు గతంలో మీడియా ఎక్సీపిరియన్స్ ఉన్న వారు కూడా కాదన్న అభిప్రాయం ఉంది.

భారత్ టుడేను ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తపిస్తున్న స్వామీజీ చానెల్ లో పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నారు. దీని కోసం ఢిల్లీ బాట కూడా పట్టారు. ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీర్వాదంతో చానెల్ ఆరంభించిన స్వామీజీకి లోకల్ యాడ్స్ పెద్దగా రావడం లేదు. చానెల్ మాస్ బాట పట్టుకుంటేనే క్లిక్కవుతుందని మనకు సక్సెస్ అయిన చానెళ్ల పంథాను చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ భారత్ టుడే విషయంలో క్లారిటీ మిస్సవుతోంది. అది న్యూస్ చానెలో, భక్తి చానలో అర్థం కాలేదని ప్రేక్షకులనుకుంటున్నారు. అదే అభిప్రాయం చానెళ్లో పనిచేస్తున్నవారికీ ఉందని చెబుతున్నారు. చానెల్ స్వరూపాన్ని చాటే ఒక్కటంటే ఒక్క కార్యక్రమమూ చానెల్ లో లేదన్నది దీనిని చూసిన ప్రతీ ఒక్కరూ చెబుతారు.
తలోతోకా లేని డిబేట్లు నిర్వహిస్తూ… ఒక ఎజెండా లేకుండా చేస్తున్నారన్న అభిప్రాయాన్న స్వామీజీ చానెల్ నిర్వాహకులుకు చెప్పారని అంటారు. అయితే ఆయనకు క్లారిటీ ఉంటే కదా మాకు క్లారిటీ ఉండేది అన్న అభిప్రాయం చానెల్ కీలక సిబ్బంది వాదన. తామర తుంపరలుగా వచ్చిన చానెళ్ల మధ్య ఎలాంటి వైవిధ్యం లేకుండా చానెల్ ఎలా సక్సెస్ అవుతుందన్న భావన స్వామీజీకి కచ్చితంగా ఉండాలి. అది లేకుంటే కచ్చితంగా తప్పే అవుతుంది. జనం మీ చానెల్ ఎందుకు చూడాలి అన్న ప్రశ్నకు మీరిచ్చే సమాధానం ఏంటి? హిందూమతాన్ని మీరు ప్రమోట్ చేయాలా… హిందూ మతం అలాంటి పరిస్థితిలో ఏమీ లేదు కదా… ఇప్పటికే భక్తి టీవీ కేవలం హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నామంటూ అనేక కార్యక్రమాలను చేస్తోంది.

కొసమెరుపేంటంటే… జీతాలివ్వడంలో ఇప్పటికి పెద్ద సమస్యలు లేవు కానీ… సీనియర్లకు జీతాలు కొంచెం లేటవుతున్నాయని మీడియా వర్గాల గుసగుసలాడుకుంటున్నాయ్. అయితే స్వామీజీ పనిచేస్తున్న సిబ్బందికి మధ్యాహ్న భోజన పథకంతో ఆకట్టుకుంటున్నారట… చిన్న ఉద్యోగులకు నిజంగా ఇది ఊరటే… మరి చానెల్ కు ఓ లాజిక్కూ ఉంటే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com