జ‌గ‌న్ కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వడం సాధ్య‌మా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈసారి త‌మ‌కే మ‌ద్ద‌తు ఇస్తార‌ని వైకాపా మాజీ ఎంపీ అభిప్రాయ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. వైకాపా అధినేత ముఖ్య‌మంత్రి కావ‌డం కోసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని ప‌వ‌న్ చెప్పిన‌ట్టు వ‌ర‌ప్ర‌సాద్ చెప్ప‌డం.. స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇంత‌కీ.. ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ఉంటుందా..? ఒకే వేదిక‌పైకి రాగ‌లిగే కామ‌న్ పాయింట్స్ ఉన్నాయా..? వైకాపా నేత‌లు ఆశిస్తున్న‌ట్టు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వ‌గ‌ల‌రా..? ఆ మాట ప‌వ‌న్ నేరుగా ఎందుకు ప్ర‌క‌టించ‌డం లేదు..? ఇలాంటి చాలా అంశాలపై ఇప్పుడు చ‌ర్చ మొదలైంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. స్వ‌భావ‌రీత్యా రెండు భిన్న‌ధృవాలు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లో కొంత వామ‌ప‌క్ష భావ‌జాలం, కొంత సామాన్యుడి కోణం, ప్ర‌జా స‌మ‌స్య‌ల కోణం నుంచి స్పందిస్తుంటారు. జ‌గ‌న్ విష‌యానికి వ‌చ్చేస‌రికి… కేవ‌లం సొంత అజెండా మాత్ర‌మే అన్న‌ట్టుగా ఉంటారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి కావాలి.. అంతే, స‌మ‌స్య‌ల‌న్నీ అవే తీరిపోతాయ‌న్న‌ట్టుగా జ‌గ‌న్ తీరు ఉంటుంది. అయితే, ఇద్ద‌రి మ‌ధ్యా కామ‌న్ పాయింట్‌.. రాష్ట్ర ప్ర‌భుత్వ అవినీతిపై ఆరోపణలు చేయడం మాత్రమే! ఇద్ద‌రూ కామ‌న్ గా టీడీపీని విమ‌ర్శిస్తున్నారు. ఈ ఒక్క అంశంలో మాత్ర‌మే వైకాపా, జ‌న‌సేన‌ల మ‌ధ్య కొంత సారూప్యత క‌నిపిస్తోంది.

ఎన్నిక‌లూ పొత్తు వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి.. జ‌గ‌న్ కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం త‌క్కువే. ఎందుకంటే, ఎలాంటి ఆధారాలూ లేకుండా టీడీపీ అవినీతిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు క‌దా, పక్కా ఆధారాలతో అవినీతికి పాల్ప‌డ్డారంటూ కేసుల్లో ఇరుక్కున్న జ‌గ‌న్ కి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ‌తారా..? చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ముఖ్య‌మంత్రి కాకూడ‌ద‌నేది ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుత ల‌క్ష్యం అనుకున్నా… ప్ర‌త్యామ్నాయంగా జ‌గ‌న్ ను చూస్తున్నార‌ని చెప్ప‌లేం! ఎందుకంటే, 175 స్థానాల్లో జ‌నసేన కూడా పోటీకి దిగుతోంది. మ‌న ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తాం, కొత్త రాజ‌కీయాలు చేస్తామంటూ ప‌వ‌న్ కూడా త‌న‌కు తాను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప‌రోక్షంగా ప్ర‌క‌టించుకున్నారు.

2014 ఎన్నిక‌ల్లో అనుభవం గ‌ల నాయ‌కుడు అవసరం కాబ‌ట్టి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చార‌నీ, అయితే అవినీతి పెరిగిపోయింది కాబ‌ట్టి ఈసారి జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇస్తార‌ని వ‌ర‌ప్ర‌సాద్ అన్నారు క‌దా! ఈ వ్యాఖ్య‌లోనే గంద‌ర‌గోళం ఉంది. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చెయ్య‌లేదు కాబ‌ట్టి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇచ్చారు. 2019లో పోటీ చేస్తున్నారు. పైగా, గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నందుకు చింతిస్తున్నా అంటూ పవ‌న్ ఈ మ‌ధ్య‌నే బాధ‌ప‌డుతూప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఇంకోటి.. అవినీతి పెరిగిపోయింది కాబ‌ట్టి జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇస్తార‌నే అంచ‌నా కార్య‌రూపం దాల్చే ఆలోచ‌న‌గా క‌నిపించ‌డం లేదు. టీడీపీలో అవినీతి పెరిగింద‌ని, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జ‌గ‌న్ కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇస్తే… విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు కదా. పవన్ చేస్తామంటున్న కొత్త రాజకీయలకు ఆస్కారం ఎక్కడుంటుంది..?

అన్న‌ిటిక‌న్నా ముఖ్యమైంది.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌నల్లో కొంత గాలివాటం ఉండటం. టీడీపీ అవినీతీ అవినీతీ అంటున్నారే త‌ప్ప‌, ఆధారాల‌తో ప‌వ‌న్ మాట్లాడ‌టం లేదు. అందరూ అనుకుంటున్నారని అంటున్నా అనేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి. గమనించాల్సిన మరో పరిణామం.. ఓప‌క్క ప‌వ‌న్ మ‌ద్ద‌తుపై వైకాపాలో చ‌ర్చ జ‌రుగుతుంటే.. మ‌రోప‌క్క నిన్న‌నే చంద్రబాబుతో ప‌వ‌న్ కలుసుకోవడం. ఇద్దరూ పలకరింపులకు మాత్రమే పరిమితమయ్యారని అంటున్నా… కాసేపు ఆంతరంగికంగా కాసేపు చర్చించుకున్నారనే సమాచారమూ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close