ఎన్నికలు ముంచుకొస్తున్నా పార్టీ గురించి పట్టించుకోని రజనీ..! టీవీ చానల్ మాత్రం రెడీ..?

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు కానీ.. ఇప్పటి వరకూ.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఓ ఫ్యాన్స్ వేదిక పెట్టారు. “మక్కల్ మండ్రమ్” పేరుతో అభిమానులను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నారు. ఆ మండ్రమ్ కార్యక్రమాలు ఏవీ పెద్దగా జరగడం లేదు. త్వరలో తమిళనాడులో ఇరవై అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు రాబోతున్నాయి. అలాగే.. మరో రెండు, మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయినా సరే రజనీకాంత్ సినిమా తర్వాత సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. షాట్ గ్యాప్ లో కూడా రాజకీయం ఆలోచిస్తున్నారో లేదో తెలియని పరిస్థితి ఉంది. కానీ రాజకీయం పేరుతో.. కొన్ని వ్యాపారాలు మాత్రం… ఫ్యాన్స్ తో పెట్టిస్తున్నారు. తాజాగా ఓ టీవీ చానల్ ను ఆయన అభిమానులు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తన పేరుతో ఓ టీవీ ఛానల్ కూడా ఏర్పాటు చేయడానికి.. ఓ వీరాభిమానికి చాన్సిచ్చారు. దాని కోసం చేసుకున్న దరఖాస్తు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఛానల్ కోసం రజినీ అభిమానుల సంఘం కన్వీనర్ సుధాకర్ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ వెబ్‌సైట్‌లో అప్లై చేశారు. రజినీ తన పేరు, ఫొటోను ఉపయోగించుకునేందుకు సమ్మతిని తెలుపుతూ ఓ లేఖ కూడా ఇచ్చారు. నవంబర్ 9న అప్లై చేశారు. అయితే కేవలం న్యూస్ మాత్రమేనా.. లేక ఎంటర్టైన్మెంట్ ఛానలా అన్నది తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ టీవీ, రజినీ టీవీ, తలైవార్ టీవీ పేర్ల కోసం అప్లై చేయగా.. ఆరు లోగోలను కూడా దరఖాస్తులతో పాటు జతచేశారు. అందులో సూపర్ స్టార్ టీవీకి రజినీకాంత్ క్యారికేచర్స్‌తో కూడిన లోగో ఇచ్చారు. రజనీ అనుమతి లేఖ కూడా ఉండటంతో ఇది నిజమేననుకుంటున్నారు.
.
రజనీ కాంత్….ఈ నెల పన్నెండో తేదీన తన పుట్టిన రోజు పార్టీ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. ఆయన మాత్రం.. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రాజకీయాలు పెద్దగా మాట్లాడలేదు. రజనీ పరిస్థితి చూసి.. ఆయన రాజకీయాల్లో రారని.. ఊరకనే హడావుడి చేస్తూంటారని.. అక్కడి రాజకీయ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ అడుగులు చూస్తూంటే.. అలానే ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే పార్టీ పెడతానని ప్రకటించినందున… ఇప్పుడు ఉపఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో తప్పించుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close