చ‌ర‌ణ్ జారుకొంటాడా.. దొరికిపోతాడా?

మ‌ణిర‌త్నం సినిమా ‘చెలియా’ రిజ‌ల్ట్ గురించి ఎవ‌రు బెంగ పెట్టుకొన్నా పెట్టుకోక‌పోయినా.. రామ్‌చ‌ర‌ణ్ త‌ప్ప‌కుండా పెట్టుకొనే ఉంటాడు. ఎందుకంటే మ‌ణి త‌దుప‌రి సినిమా చ‌ర‌ణ్‌తోనే. దిగ్గ‌జ ద‌ర్శ‌కులు క‌దా, వాళ్ల చేతిలో హిట్స్ ఉన్నా, లేకున్నా ఫ‌ర్వాలేదు.. కానిచ్చేద్దాం అనే కాలం కాదిది. ద‌ర్శ‌కుడెవ‌రైనా స‌రే… ట్రాక్ రికార్డ్ చూడాల్సిందే. ఎందుకంటే ఒక్క సినిమాతో జాత‌కాలు మారిపోతాయి. గ‌ట్టి ఫ్లాప్ త‌గిలితే తేరుకోవ‌డం చాలా క‌ష్టం. ఆసంగ‌తి చ‌ర‌ణ్‌కి బాగా తెలుసు. వ‌రుస వైఫ‌ల్యాల త‌ర‌వాత `ధృవ`తో కాస్త రేసులోకి వ‌చ్చాడు. ఇప్పుడు సుకుమార్‌సినిమా ప‌ట్టాలెక్కించాడు. ఇదీ ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమానే కాబ‌ట్టి రిజ‌ల్ట్ అటూ ఇటూ ఉండొచ్చు. ఆ వెంట‌నే మ‌ణితో సినిమా చేయాల్సివుంది.

‘చెలియా’ నెగిటీవ్ టాక్ క‌చ్చితంగా చ‌ర‌ణ్‌ని భ‌య‌పెట్టే ఉంటుంది. పైగా ఆ క‌థ‌ని ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌కు వినిపిస్తే ‘నో’ చెప్పారు. మ‌ణిర‌త్నంతో సినిమా చేయాలన్న ఏకైక ల‌క్ష్యంతో చ‌ర‌ణ్ ఆ క‌థ‌ని ఒప్పుకొన్నాడు. ఈ నేప‌థ్యంలో చెలియా విడుద‌లైంది. ఇప్పుడు చ‌ర‌ణ్ డ్రాప్ అవుతాడా? లేదంటే మాటిచ్చేశాం క‌దా అని ఈ ప్రాజెక్టుని లైన్‌లోకి పెడ‌తాడా ? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు చ‌ర‌ణ్ త‌న‌కు తాను నిర్ణ‌యాలు కూడా తీసుకోవ‌డం లేదు. ప్ర‌తీ సినిమాకి ముందు డాడీ చిరంజీవి ప‌ర్మిష‌న్ త‌ప్ప‌ని స‌రి. చ‌ర‌ణ్ – మ‌ణిర‌త్నం కాంబో ప‌ట్టాలెక్కాలా లేదా? అనేది చిరు నిర్ణ‌యంపై ఆధార ప‌డి ఉంటుంది. మ‌రి మెగాస్టార్ ఏమంటాడోచూడాలి .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com