2 రాష్ట్రాల్లో రామోజీ ఇంకా రాజ గురువేనా?

‘నేను తెలుగు భాష లెక్క. ఆడా ఉంటా, ఈడా ఉంటా ‘ అన్న గోన గన్నారెడ్డి ని మనం సినిమాల్లోనే చూశాo. అయితే ఒక పెద్దాయన ను మాత్రం ప్రత్యక్షంగా చూస్తున్నాం.

ఉమ్మడి రాష్ట్రం 2 ముక్కలుగా అయ్యాక… అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలోనూ మహామహా రాజకీయ నేతలు కనపడకుండా పోయారు. మారిన రాజకీయ పరిస్థితులను జీర్ణించుకోలేక అప్రకటిత అస్త్ర సన్యాసం చేస్తున్నవారు ఎందరో… వీరిలో సమైక్యవాదులు ఎక్కువ అని వేరుగా చెప్పినక్కర్లేదు.

అయితే మీడియా మొఘల్, స్వతహాగా సమైక్యవాది అయిన రామోజీరావు మాత్రం విభజన తర్వాత కూడా తన హవా కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర మొదలైన రామోజీ రాజగురువు పాత్ర… చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగింది. ఇది అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజకీయ పరిణామాలు అన్నింటిలో తనదైన ప్రభావం చూపించిన రామోజీ.. వై.ఎస్ హయాంలో బాగా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నారు. రాజకీయo సంగతి దేవుడెరుగు తనను తాను నిలబెట్టుకోవాల్సిన అగత్యం దాపురించింది.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తధ్యం అని తెలిపోయాక… ఇక రామోజీ హవా ముగిసిన శకం అనుకున్నవారే ఎక్కువ. ఫిలింసిటీ ని లక్ష నాగళ్ల తో దున్నిస్తా అన్న కేసీఆర్ సిఎం అవడంతో వైఎస్ తో మించిన పోరాటం రామోజీకి తప్పనిసరి అనుకున్నారంతా.
అయితే ఒక అడుగు వెనక్కి వేయడం అంటే వంద అడుగులు ముందుకు వేయనున్నట్టే… అని నిరూపిస్తూ రామోజీ చక్రం తిప్పారు. మళ్ళీ తన పూర్వ వైభవాన్ని స్వంతం చేసుకున్నారు. దీనితో శత్రువు కావాల్సిన కేసీఆర్ ఆప్త మిత్రుడు అయిపోయారు. స్వయoగా ఫిల్మ్ సిటీ సందర్శించి, రామోజీని వేనోళ్ళ పొగిడి మరీ వెళ్లారు.

ఇక ఏపీ లో మరోసారి తను సీఎం కావడానికి కారణమైన రామోజీకి చంద్రబాబు ఎప్పుడూ విధేయులే. మరో వైపు విపక్ష నేత జగన్ సైతం రామోజీని ఇప్పటికే 2 సార్లు కలిశారు. అంతే కాదు ఉన్నత రాజకీయ లక్ష్యాలు ఉన్న ఎవరైనా సరే రామోజీ దర్శనం చేసుకోకుండా ఉండడం లేదు. అది పవన్ కళ్యాణ్ అయినా మరొకరైనా. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సీఎం కుర్చీ ఎక్కాలనే ఆకాంక్ష మెండుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం రామోజీని కలిసి గంటకు పైగా చర్చించారని, కొత్త పార్టీ ఆలోచనను ఆయన తో పంచుకున్నారని సమాచారం.

రామోజీ ఇంత వేగంగా తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకున్నారంటే అందుకు ఆయన శక్తి యుక్తులే కారణం. ప్రత్యర్థి కన్నా ఒక అడుగు ముందు ఆలోచించడం, అనూహ్య మైన వ్యూహాలతో పని చేయడం రామోజీ బలం. సాక్షి పత్రిక వచ్చిన కొత్తలో ఈనాడు కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తిరిగి ఎవరూ అందుకోలేనంత ఎత్తు లో ఈనాడును నిలబెట్టగలిగారు. తన మీడియాను అగ్రగామిగా ఉంచడం, అలాగే మోడీ దగ్గర ఆయనకు ఉన్న ప్రాధాన్యత కూడా రాష్ట్రంలో రాజకీయ నేతలకు ఆయన్ని తిరిగి రాజగురువుగా మార్చింది. ఏదేమైనా… సమీప భవిష్యత్తులో రామోజీ హవాకు అడ్డుకట్ట పడే సూచనలు లేవనేది నిజం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close