ఏ విధంగా “కొత్త తరం రాజకీయాలు” పవన్ ..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్… బ్రాహ్మండంగా … నిర్వహించబోతున్న కవాతు ఉత్సాహంలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ఆయన తన ఉత్సాహాన్ని… కొన్ని ట్వీట్ల ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా… కవాతు కోసం.. హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా పాపులర్ చేయాలనుకున్నారు. #JSPforNewAgePolitics పేరుతో పాపులర్ చేయాలని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. అవకాశవాద రాజకీయాలకు ముగింపునిస్తానంటున్నారు. ప్రస్తుత రాజకీయ నేతల తీరుపై.. విసుగెత్తిపోయానన్నారు. ఇంకా చాలా చాలా చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. పవన్ కల్యాణ్.. ఈ “కొత్త తరం రాజకీయాల” కోసం… ఎలాంటి అడుగులు వేస్తున్నారు. చెప్పిన మాటలకు.. చేస్తున్న చేతలకు ఏమైనా పొంతన ఉందా..?

యువతకు అవకాశాలిచ్చారా..?

జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవనిజం అనే పుస్తకం విడుదల చేశారు. అందులో ఒక్క ముక్క అర్థమైన వాళ్లు ఎవరూ లేరని.. చాలా మంది చెప్పుకొచ్చారు. సరే.. పవన్ కల్యాణ్ మేధావులతో ఎక్కువగా మాట్లాడుతారు కాబట్టి… అర్థం కాకుండా చెప్పేవాళ్లే మేధావులు కాబట్టి.. పవన్ కల్యాణ్ కూడా ఆ కోవకే చెందిన వారు అనుకున్నారు. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. ప్రజలు మాత్రం.. పవన్ కల్యాణ్‌ ఏదో కొత్త రాజకీయం చేస్తారని మాత్రం ఆశించారు. దానికి తగ్గట్లుగానే ఆయన స్పీచ్‌లు ఉన్నాయి. ఇప్పుడున్న రాజకీయు పార్టీల్లో ఉన్న నేతలెవరూ జనసేనకు వద్దని చాలా సార్లు చెప్పారు. నిజమే కాబోలనుకున్నారు జనం. ఎందుకంటే.. మొదట్లో ఎవర్నీపార్టీలో చేర్చుకోలేదు. చేరుతామని కూడా.. ఎవరూ వెళ్లలేదు. కానీ.. గుండెలు మండే… బుల్లెట్లకు ఎదురెళ్లే…యువతను ఎంపిక చేసుకుంటానంటూ.. ఏపీ, తెలంగాణ జిల్లాల్లో శిబిరాలు నిర్వహించి.. పరీక్షలు పెట్టి.. కొంత మందిని ఎంపిక చేసుకున్నారు. వారిలో ఎవరికైనా అవకాశం కల్పించారా … అంటే లేదనే సమాధానం వస్తోంది. ఇది కొత్తతరహా రాజకీయమా..?

ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారే దిక్కా..?

తీరా ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి.. ఆయన పార్టీలో రాజకీయ అవకాశాల కోసం… పార్టీలు మారి జంపింగ్‌లు చేస్తున్న నేతలు మాత్రమే ఆయన చుట్టూ కనిపిస్తున్నారు. ఒక్కరంటే.. ఒక్కరైనా జనసేన పార్టీ నేత స్వతహాగా ఎదిగి వచ్చిన వారున్నారు. ఇప్పుడు పార్టీని నడుపుతున్న తోట చంద్రశేఖర్ నుంచి… తనకు అన్నయ్యలాంటి వాడంటూ.. చెప్పుకున్న… నాదెండ్ల మనోహర్ వరకూ అందరూ.. రాజకీయ అవకాశాలు కోసం వెంటపడి వచ్చిన వారే. తెలుగుదేశం, వైసీపీల్లో టిక్కెట్లు వస్తాయని.. పది శాతం ఆశ ఉన్నా.. కూడా.. ఎవరూ… జనసేన వైపు చూడటం లేదు. అక్కడ పూర్తిగా దారులు మూసుకుపోతే.. జనసేన వైపు వస్తున్నారు. వారందర్నీ పవన్ కల్యాణ్ సాదరంగా అహ్వానిస్తున్నారు. మరి ఇది అవకాశవాద రాజకీయం కాదా..? కొత్త తరహా రాజకీయమా..?

కులం వాడకం ఎందుకు…?

ఇక కులాల విషయంలో.. తనకే ఏ కులం లేదని.. పవన్ పదే పదే చెబుతూంటారు. కానీ కులం ముద్ర వేసుకోవడానికి తహతహలాడుతూ ఉంటారు. దాదాపుగా ప్రతి స్పీచ్‌లోనూ కులం ప్రస్తావన తెస్తూంటారు. మొన్నటికి మొన్న.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వెళ్లి… అక్కడి టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి.. జవహర్‌ను రెచ్చగొట్టేందుకు… “నీ కులాన్ని తిడితే నీకు కోపం రావడం లేదా.. నాకు వస్తుంది..” అని.. ప్రసంగించారు. ఇక తన సామాజికవర్గ పెద్దలతో నిధుల సమీకరణ వ్యవహారం ఓ పెద్ద కలకలమే రేపింది. .. ఇది కొత్త తరహా రాజకీయమా..?. ఇలా చెప్పుకుటూ.. పోతే.. పవన్ కల్యాణ్.. తన పార్టీకి.. ఇతర పార్టీలకు పోలికలు లేకుండా చేసుకున్నారు. మళ్లీ… కొత్తతరహా రాజకీయం కోసం.. జనసేన అంటూ.. నినాదాలు చేస్తున్నారు. ఈ విషయంలోనూ.. పవన్ కల్యాణ్.. ఇతర రాజకీయ నేతలను మించిపోతున్నారని అర్థం చేసుకోవాలి. అంటే చివరిగా.. తాను కూడా “ఆ తానులో ముక్కే”నని అర్థం చేసుకోవాలి.

———సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close