#RRR టైటిల్ ముందే డిసైడ్ అయిపోయిందా?

#RRR సినిమాకి రాజ‌మౌళి ఏం పేరు పెడ‌తాడు?? అనేది ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఈ సినిమాకి పేరు పెట్టే బాధ్య‌త రాజ‌మౌళి ప్రేక్ష‌కుల‌కు అప్ప‌గించ‌డం, వాళ్లు ర‌క‌ర‌కాల టైటిళ్ల‌ని వినిపించ‌డం చూస్తూనే ఉన్నాం. అయితే వీట‌న్నింటిలోనూ `ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం` అనే పేరుకి ఎక్కువ ఓట్లు ప‌డుతున్నాయి. దీన్నే టైటిల్‌గా పెట్టుకుంటే.. ప్ర‌తి భాష‌లోనూ కొత్త టైటిల్‌ని పెట్టే అవ‌స‌రం ఉండ‌దు. ప్ర‌తీ చోటా.. ఈ టైటిల్ తోనే సినిమాని విడుద‌ల చేయొచ్చు.

అయితే… రాజమౌళి బృందం ముందే ఓ టైటిల్‌ని అట్టి పెట్టుకున్నార‌ని – కేవ‌లం ప్రేక్ష‌కుల ఇన్‌వాల్వ్‌మెంట్ కోసం, టైటిల్ ప‌ట్ల క్రేజ్ ఏర్ప‌డ‌డం కోసం రాజ‌మౌళి ఇలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. చివ‌రికి రాజ‌మౌళి అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేసి – దాన్ని ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన టైటిల్‌గా క్రియేట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. సో… ఇదంతా రాజ‌మౌళి మార్కెట్ స్ట్రాట‌జీ అన్న‌మాట‌. ఒక్క తెలుగు టైటిలే కాదు.. మిగిలిన భాష‌ల టైటిళ్ల‌కు సంబంధించి కూడా రాజ‌మౌళి బృందం ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, ఒకొక్క భాష‌లో నిర్ఱ‌యించిన టైటిళ్ల‌న్నీ ఒకేసారి ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం అందుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close