‘పెద్ది’ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉంది. మరి ఆ పాటలో కనిపించబోయే హీరోయిన్ ఎవరు? అనే విషయంపై చాలా కాలంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంది. ఈ గ్యాప్లో చాలామంది పేర్లు వినిపించాయి. మృణాల్ అయితే దాదాపుగా ఖాయం అనుకొన్నారు. ఓ దశలో నలుగురైదుగురు హీరోయిన్లు కూడా కనిపించే ఛాన్స్ ఉంది అన్నారు. అయితే ఇప్పుడు సోలో హీరోయిన్ కి ఫిక్సయ్యారని, ఆ ఛాన్స్ సంయుక్త మీనన్ కి దక్కిందని చెప్పుకొంటున్నారు.
సంయుక్త ఫామ్ లో ఉన్న హీరోయిన్నే. ఇందులో డౌటు లేదు. తన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఆమధ్య ‘అఖండ 2’లో ఓ డాన్స్ నెంబర్ చేసింది. కాకపోతే.. ‘పెద్ది’ లాంటి భారీ సినిమాలో, అందులోనూ రామ్ చరణ్ సరసన ఐటెమ్ పాట ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు. బాలీవుడ్ నుంచో, మరో చోట నుంచో స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతారనుకొంటారు. ‘పెద్ది’ సినిమాకు ఆ క్యాపబులిటీ ఉంది కూడా. కానీ సంయుక్త తో సరిపెట్టుకొంటే… ఐటెమ్ నెంబర్ కి అంత క్రేజ్ వస్తుందా అనేది అనుమానమే. చరణ్ సినిమా కాబట్టి, పెద్దికి ఆల్రెడీ బజ్ ఉంది కాబట్టి, ఎవరైనా సరిపోతారనుకొంటే.. ఇంకేం చేయలేం. సినిమా ఎలాగూ ఆలస్యమైంది. ఇప్పటికిప్పుడు పాట పూర్తి చేయాలన్న కండీషన్ లేదు. కాబట్టి.. కాస్త టైమ్ తీసుకొని, కొంత పొటన్షియాలిటీ ఉన్న హీరోయిన్ ని తీసుకొంటే బాగుంటుందని చరణ్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఇప్పటికైతే సంయుక్త పేరు కేవలం రూమర్ మాత్రమే. ఇది నిజమేనా కాదా? అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సివుంది.
