‘సైమా’ హిట్టా? ఫ్లాపా?

సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డు (సైమా) పేరుతో ప్ర‌తీ యేటా ఘ‌నంగా అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రుగుతోంది. ఈసారి ‘సైమా’ వేదిక దుబాయ్‌కి మారింది. భారీ బ‌డ్జెట్‌, క‌నీవినీ ఎరుగ‌ని వ‌స‌తుల‌కు `సైమా` పెట్టింది పేరు. వేదిక‌పై ఆడిపాడిన వాళ్ల‌కు భారీ న‌జ‌రానాల‌ను అందిస్తుంటుంది సైమా. దానికి తోడు అవార్డు విజేత‌ల‌కూ ఏదో ఓ రూపంలో బ‌హుమానాలు వెళ్తుంటాయి. అందుకే ‘సైమా’ ఫంక్ష‌న్లో పాల్లొన‌డానికి స్టార్లు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఈసారి సైమాలో స్టార్ల మెరుపులు త‌క్కువ‌గానే క‌నిపించాయి. బాల‌కృష్ణ‌, రానాని మిన‌హాయిస్తే.. తెలుగు నుంచి స్టార్లెవ‌రూ క‌నిపించ‌లేదు. ప్ర‌భాస్‌, చిరంజీవి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వీళ్లంతా ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సింది. కానీ.. షూటింగుల్లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ‘సైమా’ని ప‌క్క‌న పెట్టేశారు. మ‌హేష్‌బాబుని ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ.. అవేం స‌ఫ‌లీకృతం కాలేదు. అలా.. ‘సైమా’ వేదిక స్టార్లు లేకుండా క‌ళ త‌ప్పింది. అయితే.. డాన్సింగ్ ఈవెంట్లు బాగానే ఉండ‌డంతో… ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సిన ఎంట‌ర్‌టైనింగ్ దొరికిన‌ట్టైంది. సైమా స్పాన్సర్ షిప్‌ల‌ను బాగానే ప‌ట్టుకోగ‌లిగింది. వాటి రూపంలో క‌నీసం `సైమా`కి రూ.5 కోట్ల వ‌ర‌కూ లాభం అంది ఉంటుంద‌ని ఓ అంచ‌నా. స్టార్ల రాక‌పోక‌లు ఎలా ఉన్నా.. ఆర్థికంగా మాత్రం సైమాకు లాభాలు బాగానే వ‌చ్చాయ‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల‌ టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close