నాగ‌బాబుకి ఇచ్చే ‘రిట‌ర్న్ గిఫ్ట్‌’ ఇదేనా?

కేసీఆర్ – చంద్ర‌బాబు మ‌ధ్య ‘రిట‌ర్న్ గిఫ్ట్‌’ల వైరం న‌డుస్తోంది. ఇప్పుడు తాజాగా నాగ‌బాబు – శివాజీరాజాల ‘రిట‌ర్న్ గిఫ్ట్’ వ్య‌వ‌హారం టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీగా నిలుస్తోంది. ‘మా’ ఎన్నిక‌ల‌లో చివ‌రి నిమిషంలో నాగ‌బాబు రంగ ప్ర‌వేశం చేసి న‌రేష్ ప్యాన‌ల్‌కి మ‌ద్ద‌తు తెలిపాడు. ఈ ఎన్నిక‌ల‌లో శివాజీ రాజా ఓడిపోవ‌డానికి ఓ కీల‌క కార‌ణంగా మారాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘నాగ‌బాబుకి రిట‌ర్న్ గిఫ్ట్ త‌ప్ప‌కుండా ఇస్తా’ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు శివాజీ రాజా.

ఆ రిట‌ర్న్ గిఫ్ట్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఇండ్ర‌స్ట్రీలో ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. శివాజీ రాజా రిట‌ర్న్ గిఫ్ట్ సిద్ద‌మైంద‌ని, త్వ‌ర‌లోనే అది పేల‌బోతోంద‌ని టాక్‌. నాగ‌బాబు జ‌న‌సేన‌లో చేర‌డం, న‌ర‌సాపురం నుంచి పార్ల‌మెంట్‌కి పోటీ చేస్తుండ‌డం తెలిసిన విష‌యాలే. త్వ‌ర‌లో ఆయ‌న ప్ర‌చారం కూడా మొద‌లుపెట్ట‌బోతున్నారు. అయితే నాగ‌బాబుకి వ్య‌తిరేకంగా శివాజీ రాజా కూడా ప్ర‌చారం చేస్తార‌ని తెలుస్తోంది. ఆయ‌న వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈరోజు అధికారికంగా వైకాపాలో చేర‌బోతున్నాడు. వైకాపా పార్టీ త‌ర‌పున నాగ‌బాబుకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసి త‌ద్వారా నాగ‌బాబు గెలుపుని అడ్డుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నార్ట‌. మొన్న‌టి వ‌ర‌కూ ‘ప‌వ‌న్ చాలా నిజాయ‌తీ ప‌రుడు’ అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చాడు శివాజీ. అలాంటిది ఆ పార్టీనీ, ఆ పార్టీ కోసం ప‌ని చేస్తున్న నాగ‌బాబునీ విమ‌ర్శిస్తాడ‌న్న‌మాట‌. నాగ‌బాబుని ఎలా ఇర‌కాటంలో పెట్ట‌డానికి శివాజీ రాజా అస్గ్రాలు కూడా సిద్దం చేసుకున్నాడ‌ని టాక్‌. మ‌రి అవి ఏ స్థాయిలో పేల‌బోతున్నాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close