మోడీ వ్యూహం అదేనా…?

ఒక్క ట్వీట్ తో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కాబూల్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానం లాహోర్ లో ల్యాండ్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ హటాత్తుగా పాక్ లో పర్యటించడం సంచలనం కలిగించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యక్తిగతంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం, ఆయన మనవరాలి పెళ్లి వేడుకలో పాల్గొనడం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడం.. ఇవీ మోడీ చేసి మూడు పనులు.

ఉగ్రవాదాన్ని ఎగదోసే పాక్ చర్చలు జరిపే ప్రసక్తే లేదని చాలా కాలంగా భారత్ స్పష్టంగా చెప్తోంది. హటాత్తుగా ఈ వైఖరి మారడానికి కారణం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. పారిస్ లో ఐదు నిమిషాల సంప్రదింపుల తర్వాత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించడమే పెద్ద విషయం అనుకున్నారు అందరూ. అలాంటిది, షెడ్యూలులో లేకుండా, ఏ ఎజెండా లేకుండా, మోడీ తొలిసారిగా, అదీ హటాత్తుగా పాక్ లో పర్యటించడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

ఇది సృజనాత్మక దౌత్యమని, స్టేట్స్ మన్ తరహా నిర్ణయమని బీజేపీ నాయకులు డంకా బజాయించి ప్రశ్నంసలు కురిపించారు. వాస్తవ పరిస్థితిలో ఏం మారిందని ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. బీజేపీ మిత్రపక్షం శివసేన మొదటినుచీ పాక్ తో చర్చలను వ్యతిరేకిస్తోంది. సరిహదదుల్లో కాల్పులు జరుపుతూ మన సైనికుల తలలను నరికే పాక్ సైనికుల వైఖరికి నిరసనగా చర్చలు జరప వద్దనేది శివసేన వాదన. సామాన్యప్రజల్లోనూ పాక్ తో చర్చలు జరపవద్దని భావించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇంతకీ మోడీ పర్యటన వల్ల పాక్ ఏమైనా మారుతుందా?

తన భూభాగంగా ఉగ్రవాద శిక్షణ శిబిరాలను బంద్ చేస్తుందా?

ఉగ్రవాదులను సరిహధ్దులు దాటించడం ఆపేస్తుందా?

అంతర్జాతీయంగా మన మీద విషం కక్కడం మానేస్తుందా?

కాశ్మీర్ ను అంతర్జాతీయ సమస్యగా చిత్రించడం ఆపుతుందా?

కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ఒప్పుకుంటుందా?

ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంకు కరాచీలో ఆశ్రయం ఇవ్వడం బంద్ చేస్తుందా?

దావూద్ ఇబ్రహీంను భారత్ కు అప్పగిస్తుందా?

అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ముష్కరుడు, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ను భారత్ కు అప్పగిస్తుందా?

ముంబై దాడులతో సంబంధం ఉందంటూ పాక్ లో అరెస్టు చేసిన వారిని భారత్ కు అప్పగిస్తుందా?

పోనీ, వారికి పాక్ లోనే కఠిన శిక్ష పడేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

ఇన్ని ప్రశ్నలకూ ఒకే ఒక్క జవాబు… లేదు. ఇవేమీ జరగవు. మరి మోడీ లాహోర్ ఎందుకు వెళ్లినట్టు? అరుణ్ జైట్లీ వ్యవహారంలో ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహం కావచ్చనే ఒక వాదన వినిపిస్తోంది. అటు విపక్షాలు, ఇటు స్వపక్షం నుంచి సస్పెండ్ అయిన కీర్తి ఆజాద్ నుంచి బీజేపీ ఇబ్బందికర ఆరోపణలనుఎదుర్కొంటోంది. జైట్లీపై విచారణ జరిపించాలనే డిమాండ్ బలపడుతోంది. దీని తీవ్రత తగ్గించడానికి లాహోర్ అస్త్రం ప్రయోగించి ఉంటారనేది కొందరి అభిప్రాయం. అలాగే, మైనారిటీలకు పూర్తి వ్యతిరేకి అనే ముద్ర తొలగించుకోవాలనే ఉద్దేశం కావచ్చనే మరో వాదన వినవస్తోంది. తాను ఎంతో పెద్దరికం గల స్టేట్స్ మన్ ను అనిపించుకోవాలనే తపన కారణం కావచ్చని మరి కొందరు అంటున్నారు.

ఈ భూమిమీద మారనిదంటూ ఏదైనా ఉందా అంటే అది పాకిస్తాన్ వక్రబుద్ధి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనేది పాక్ విషయంలో సరిగ్గా వర్తిస్తుంది. అలాంటి దేశంలో చర్చలు అనవసరని 1947 నుంచీ రుజువవుతూనే ఉంది. ఇప్పుడు మోడీ హటాత్ పర్యటనకు కారణం ఏమైనా, దీని వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది భ్రమే అవుతుందంటున్నారు పరిశీలకులు. ప్రజల్లో అత్యధికులు కూడా ఇలాగే భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close